అపోలో హాస్పిటల్స్ లాభం రూ.379 కోట్లు
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:25 AM
అపోలో హాస్పిటల్స్ సెప్టెంబరు త్రైమాసికానికి అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.5,589 కోట్ల ఆదాయంపై రూ.816 కోట్ల స్థూల లాభం, రూ.379 కోట్ల నికర లాభం ఆర్జించింది...
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ సెప్టెంబరు త్రైమాసికానికి అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.5,589 కోట్ల ఆదాయంపై రూ.816 కోట్ల స్థూల లాభం, రూ.379 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 15 శాతం, స్థూల లాభం 30 శాతం, నికర లాభం 63 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలను పరిగణనలోకి తీసుకున్నా రూ.10,675 కోట్ల ఆదాయంపై రూ.1,491 కోట్ల స్థూల లాభం, రూ.684 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 15 శాతం, స్థూల లాభం 31 శాతం, నికర లాభం 71 శాతం పెరిగాయి.