అపోలో నుంచి ‘అపోలో రీసెర్చి అకాడమీ’
ABN , Publish Date - Sep 05 , 2024 | 02:49 AM
వైద్య పరిశోధనతో పాటు, ఆ రంగంలో వినూత్న కార్యక్రమాల నిర్వహణ అపోలో రీసెర్చ్ అకాడమీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్టు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. రవి పీ మహాజన్ ఈ సంస్థకు...
న్యూఢిల్లీ: వైద్య పరిశోధనతో పాటు, ఆ రంగంలో వినూత్న కార్యక్రమాల నిర్వహణ అపోలో రీసెర్చ్ అకాడమీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్టు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. రవి పీ మహాజన్ ఈ సంస్థకు నాయకత్వం వహిస్తారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కంపెనీలు అపోలో హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి ఫౌండేషన్, అపోలో యూనివర్సిటీ, ఏఆర్‌ఐ, అపోలో రీసెర్చ్ సెంటర్, అపోలో క్లినికల్ ఇన్నోవేషన్ గ్రూప్ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ అపోలో రీసెర్చ్ అకాడమీ పని చేస్తుంది. ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ వైద్య పరిశోధనలకు సైతం కేంద్రంగా ఎదిగేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు.