Share News

కొత్త లోగోతో బీఎ్‌సఎన్‌ఎల్‌కు కళ

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:31 AM

ప్రభుత్వ రంగంలోని భారత్‌ సంచా ర్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌) పూర్వ వైభవం పునరుద్ధరించుకునేందుకు కొత్త హంగులతో ప్రజల ముందుకు వస్తోంది....

కొత్త లోగోతో బీఎ్‌సఎన్‌ఎల్‌కు కళ

7 కొత్త సర్వీసులు ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారత్‌ సంచా ర్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌) పూర్వ వైభవం పునరుద్ధరించుకునేందుకు కొత్త హంగులతో ప్రజల ముందుకు వస్తోంది. అందులో ఒకటి కొత్త లోగో విడుదల చేయడం కాగా మంగళవారం 7 కొత్త సేవలను ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ సేవలను ప్రారంభించారు. వాటిలో స్పామ్‌ బ్లాకర్‌, సిమ్‌ కియో్‌స్కలు, దేశంలోనే ప్రప్రథమంగా డైరెక్ట్‌ టు డివైస్‌ సర్వీసు ఉన్నాయి. అలాగే సీడాక్‌ భాగస్వామ్యంతో పూర్తిగా దేశీయంగా తయారైన పరికరాలను ఉపయోగించి మైనింగ్‌ కార్యక్రమాల్లో ఉన్న వారు క్షణాల్లో సమాచారం అందుకునేందుకు వీలుగా 5జీ కనెక్టివిటీని కూడా కల్పించింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విడుదల చేసిన 4జీ సర్వీసులను త్వరలో పూర్తిస్థాయి 4జీ సర్వీసులుగా విస్తరిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌ వాటా విషయంలో ప్రైవేట్‌ టెలికాం ఆపరేటర్ల కన్నా బీఎ్‌సఎన్‌ఎల్‌ చాలా వెనుకబడి ఉంది.


ఢిల్లీ, ముంబై నగరాల్లో ‘‘నెట్‌వర్క్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’’ పేరిట కొత్త ఫైనాన్సింగ్‌ మోడల్‌ను కూడా ప్రారంభించనుంది. దేశంలోనే తొలి డైరెక్ట్‌ టు డివైస్‌ కనెక్టివిటీ సొల్యూషన్‌ ఉపగ్రహ, కేబుల్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌లు రెండింటినీ అనుసంధానం చేస్తుంది. అలాగే ఫైబర్‌ టు ద హోమ్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) కస్టమర్లకు వైఫై రోమింగ్‌ సర్వీసును ప్రవేశపెట్టింది. దీని వల్ల వారికి ఎలాంటి అదనపు చార్జి లేకుండానే బీఎ్‌సఎన్‌ఎల్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లభిస్తుంది. కాగా, సమీప భవిష్యత్తులో టెలికాం సర్వీసుల టారి్‌ఫలు పెంచే ఆలోచన ఏదీ లేదని బీఎ్‌సఎన్‌ఎ్‌స చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ రవి అన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:31 AM