హైదరాబాద్‌లో అసెండైన్ ఏఐ స్టూడియో
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:39 AM
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సేవల రంగంలో కార్యకలాపాలు సాగించే అసెండైన్ కంపెనీ హైదరాబాద్‌లో తన కృత్రిమ మేధ (ఏఐ) స్టూడియోను ప్రారంభించింది. ఈ కేంద్రంలో పని చేసేందుకు...
1,000 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సేవల రంగంలో కార్యకలాపాలు సాగించే అసెండైన్ కంపెనీ హైదరాబాద్‌లో తన కృత్రిమ మేధ (ఏఐ) స్టూడియోను ప్రారంభించింది. ఈ కేంద్రంలో పని చేసేందుకు కంపెనీ ఇప్పటికే 350 మంది ఇంజినీర్ల నియామకాలు పూర్తి చేసింది. వీరిలో 60 మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా చేరిన గ్రాడ్యుయేట్లు. వచ్చే ఏడాది చివరికి ఉద్యోగుల సంఖ్య 1,000 మందికి చేరుతుందని కంపెనీ సీఈఓ కార్తిక్ కృష్ణమూర్తి చెప్పారు. హైదరాబాద్‌లోని ఏఐ స్టూడియో ద్వారా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ గేమింగ్, లైఫ్ సైన్సెస్, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలకు సేవలందిస్తామని తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలో 5,000 ఎస్‌ఎఫ్‌టీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ఫార్మా కంపెనీల నిర్వహణలోనూ ఆయా కంపెనీల ఉద్యోగులకు వర్చువల్ శిక్షణ ఇస్తామని కృష్ణమూర్తి తెలిపారు. ఏఐతో ఉద్యోగాలకు పెద్దగా వచ్చే ముప్పేమీ లేదన్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో ఉత్పాదకత పెరిగి కంపెనీలకు ఖర్చులు తగ్గుతాయన్నారు.