Share News

Ashok Leyland : అశోక్‌ లేలాండ్‌ వాహన ధరలు పెంపు

ABN , Publish Date - Dec 14 , 2024 | 05:56 AM

హిందూజా గ్రూప్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ వాహనాల ధరలు జనవరి 1 నుంచి 3 శాతం పెరగనున్నాయి. అధిక కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు వాహనాల

Ashok Leyland : అశోక్‌ లేలాండ్‌ వాహన ధరలు పెంపు

చెన్నై: హిందూజా గ్రూప్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ వాహనాల ధరలు జనవరి 1 నుంచి 3 శాతం పెరగనున్నాయి. అధిక కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు వాహనాల ధరలు పెంచక తప్పడంలేదని కంపెనీ వెల్లడించింది. కాగా, నవంబరు నెలలో ఆటోమొబైల్‌ అమ్మకాల్లో 4 శాతం వృద్ధి నమోదైంది. ఈ కంపెనీలు గత నవంబరులో మార్కెట్లోకి పంపిన వాహనాలు 3,33,833 కాగా ఈ నవంబరులో 3,47,522 వాహనాలు పంపినట్లు భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ సమాఖ్య సియామ్‌ తెలిపింది.

Updated Date - Dec 14 , 2024 | 05:56 AM