Share News

ఆడి కార్లు మరింత ప్రియం

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:36 AM

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి సోమవారం ప్రకటించింది...

ఆడి కార్లు మరింత ప్రియం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి సోమవారం ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఆడి భారత మార్కెట్లో ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 సహా పలు మోడళ్లను విక్రయిస్తోంది. కాగా వచ్చే జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ బెంజ్‌ ఇప్పటికే ప్రకటించాయి.

Updated Date - Dec 03 , 2024 | 05:56 AM