Share News

Aurobindo Pharma : కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌లోకి అరబిందో ఫార్మా

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:52 AM

హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ అరబిందో ఫార్మా తాజాగా కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌లోకి ప్రవేశించింది. బయోలాజికల్స్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కోసం ప్లాంట్‌ ఏర్పాటుకు మెర్క్‌ షార్ప్‌

Aurobindo Pharma : కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌లోకి అరబిందో ఫార్మా

ఎంఎస్‌డీతో ఒప్పందం..

1,000 కోట్లతో ప్లాంట్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ అరబిందో ఫార్మా తాజాగా కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌లోకి ప్రవేశించింది. బయోలాజికల్స్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కోసం ప్లాంట్‌ ఏర్పాటుకు మెర్క్‌ షార్ప్‌ అండ్‌ దోహ్మే సింగపూర్‌ ట్రేడింగ్‌ పీటీఈ లిమిటెడ్‌ (ఎంఎ్‌సడీ)తో తన అనుబంధ సంస్థ థెరానియమ్‌ బయోలాజిక్స్‌ ఒప్పందం కుదుర్చుకుందని అరబిందో ఫార్మా శుక్రవారం వెల్లడించింది. ఇందులో భాగంగా, థెరానియమ్‌ బయోలాజికల్స్‌ రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏటా 2.5-3 కోట్ల వయల్స్‌ తయారీ సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను మెదక్‌ జిల్లాలోని హత్నూర మండలం, బోరపట్ల గ్రామంలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌లో తయారు చేసే ఉత్పత్తులను ఎంఎ్‌సడీకి సరఫరా చేయనుంది. బయోలాజికల్స్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కార్యకలాపాల కోసం థెరానియమ్‌లో మైనారిటీ వాటా కలిగిన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ క్యూరాటెక్‌ బయోలాజిక్స్‌ గత ఏడాది అక్టోబరులో ఎంఎ్‌సడీతో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను కుదుర్చుకుంది. అందులో భాగంగా ఒప్పందం ఖరారుపై చర్చలను ఈ మార్చి 31 నాటికి ముగించాల్సి ఉండగా.. డెడ్‌లైన్‌ను మే 31 వరకు పొడిగించుకున్నాయి.

Updated Date - Jun 01 , 2024 | 04:52 AM