Share News

అంతర్జాతీయ ఫార్మా సంస్థతో అరబిందో ఫార్మా జట్టు

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:32 AM

శ్వాసకోశ సంబంధిత ఔషధాల అభివృద్ధికి అంతర్జాతీయ ఫార్మా సంస్థతో జట్టు కట్టినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఈ మేరకు...

అంతర్జాతీయ ఫార్మా సంస్థతో అరబిందో ఫార్మా జట్టు

శ్వాసకోశ సంబంధిత ఔషధాల అభివృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): శ్వాసకోశ సంబంధిత ఔషధాల అభివృద్ధికి అంతర్జాతీయ ఫార్మా సంస్థతో జట్టు కట్టినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఈ మేరకు అనుబంధ సంస్థ అరబిందో ఫార్మా యూఎ్‌సఏ ఇంక్‌.. సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అయితే అంతర్జాతీయ ఫార్మా సంస్థ పేరు మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఒప్పందంలో భాగంగా శ్వాస సంబంధిత ఉత్పత్తుల అభివృద్ధి, కమర్షియలైజేషన్‌ను చేపట్టనున్నట్లు అరబిందో ఫార్మా పేర్కొంది. ఈ ఒప్పంద కాలపరిమితి తొలుత మూడు నుంచి ఐదేళ్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా అభివృద్ధి చేసిన ఔషధాలను భాగస్వామ్య సంస్థకు చెందిన ప్లాంట్‌లో ఉత్పత్తి చేయటంతో పాటు ఇరు సంస్థలు సంయుక్తంగా ఈ ఉత్పత్తులను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురానున్నాయని అరబిందో ఫార్మా తెలిపింది.

Updated Date - Nov 24 , 2024 | 01:32 AM