యాక్సిస్ మూమెంటమ్ ఫండ్
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:33 AM
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ మూమెంటమ్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది మూమెంటమ్ థీమ్‌తో కూడిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత...
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ మూమెంటమ్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది మూమెంటమ్ థీమ్‌తో కూడిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు అందించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించినట్లు యాక్సిస్ ఎంఎఫ్ వెల్లడించింది. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌గా ఉండనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.100. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఫండ్ ముగింపు తేదీ డిసెంబరు 6.