బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ
ABN , Publish Date - May 06 , 2024 | 05:49 AM
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్రివీ’ పేరుతో సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పాలసీదారులు ఆరోగ్య, గృహ, మోటార్, పర్సనల్ యాక్సిడెంట్, సైబర్ ఇన్సూరెన్స్...
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్రివీ’ పేరుతో సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పాలసీదారులు ఆరోగ్య, గృహ, మోటార్, పర్సనల్ యాక్సిడెంట్, సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ప్రివీ ద్వారా ప్రాధాన్యతా క్రమంలో కంపెనీ నుంచి ప్రత్యేక బీమా సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా పాలసీదారులకు మరింత చేరువ కావచ్చని కంపెనీ భావిస్తోంది.
ఫ్యూచర్ రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్, బ్యాటరీ టెక్నాలజీ సంస్థ అలా్ట్రవయలెట్..మార్కెట్లోకి ఎఫ్77 మాక్ 2 పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ పరిచయ ధర రూ.2.99 లక్షలు. అడ్వాన్స్‌డ్ 10.3 కిలోవాట్ బ్యాటరీతో కూడిన ఈ బైక్ ఒకసారి చార్జింగ్‌తో 323 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 3-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈ బైక్ ప్రత్యేకత. దేశవ్యాప్తంగా పదిహేను నగరాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది.