బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇష్యూ సూపర్ హిట్
ABN , Publish Date - Sep 12 , 2024 | 02:52 AM
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. బుధవారంతో ముగిసిన ఈ రూ.6,560 కోట్ల ఐపీఓకు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా విలువైన సబ్‌స్ర్కిప్షన్ లభించింది...
ఇష్యూ సైజు రూ.6,560 కోట్లు,
దాఖలైన బిడ్లు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. బుధవారంతో ముగిసిన ఈ రూ.6,560 కోట్ల ఐపీఓకు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా విలువైన సబ్‌స్ర్కిప్షన్ లభించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ 72,75,75,756 షేర్లను అమ్మకానికి పెట్టగా.. అందుకు 63.60 రెట్ల (4,627 కోట్ల 48 లక్షల 43 వేల 832) షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయని ఎన్‌ఎ్‌సఈ డేటా వెల్లడించింది. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) కోసం కేటాయించిన షేర్లకుగాను ఏకంగా 209.36 రెట్ల బిడ్లు దాఖలు కాగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగ షేర్లకు 41.50 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు మాత్రం 7.02 రెట్ల బిడ్లు వచ్చాయి. కాగా వాహన విడిభాగాల తయారీ సంస్థ క్రాస్ లిమిటెడ్ ఐపీఓకు సైతం నాటికి 16.81 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది. టోలిన్స్ టైర్స్ ఇష్యూకు కూడా 23.87 రెట్ల బిడ్లు వచ్చాయి.