Bank holidays in April 2024: ఏప్రిల్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. పనిచేసేది కేవలం..
ABN , Publish Date - Apr 01 , 2024 | 09:48 AM
మీరు ఏదైనా పని మీద ఈనెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటే, ముందుగా ఈ సెలవుల(bank holidays) జాబితాను చుసుకుని వెళ్లండి. ఎందుకంటే ఏప్రిల్ 2024(April 2024)లో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు(banks) ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ నెలలో ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
మీరు ఏదైనా పని మీద ఈనెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటే, ముందుగా ఈ సెలవుల(bank holidays) జాబితాను చూసుకుని వెళ్లండి. ఎందుకంటే ఏప్రిల్ 2024(April 2024)లో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు(banks) ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మీరు తెలియకుండా సెలవుల రోజు బ్యాంకుకు వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ నెలలో ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Loans: పర్సనల్ లోన్స్ కట్టకుంటే ఏమవుతుంది.. ఏం చర్యలు తీసుకుంటారు?
ఏప్రిల్ 1న వార్షిక ముగింపు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, జుమాత్ జుమాతుల్ విదా కారణంగా తెలంగాణ, జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7న ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 9న గుడి పడ్వా/ఉగాది పండుగ నేపథ్యంలో బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 10న ఈద్ కారణంగా కేరళలోని కొచ్చిలో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 11న ఈద్ కారణంగా చండీగఢ్, గ్యాంగ్‌టక్, కొచ్చి మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 13న రెండో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 14వ ఆదివారం కారణంగా బ్యాంకులకు హాలిడే
ఏప్రిల్ 15న బోహాగ్ బిహు, హిమాచల్ డే కారణంగా గౌహతి, సిమ్లాలో బ్యాంకులకు హాలిడే
ఏప్రిల్ 17న శ్రీరామనవమి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాంచీ, సిమ్లా, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు1
ఏప్రిల్ 20న గరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 21న ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి
ఏప్రిల్ 27న నాలుగో శనివారం నేపథ్యంలో బ్యాంకులకు హాలిడే
ఏప్రిల్ 28న ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు
అయితే ఈ రోజుల్లో బ్యాంకుకు సంబంధించి అన్ని ఆన్‌లైన్ సేవలు పనిచేస్తాయి. ఈ క్రమంలో నెట్ బ్యాంకింగ్ నుంచి UPI, SMS, ATM వరకు ఇతర సౌకర్యాలను ఉపయోగించవచ్చు. మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ ఆన్‌లైన్ పనిని కూడా పూర్తి చేయవచ్చు. ఎలాంటి సమస్య ఉన్నా, మీరు బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎంఎ్‌సఎంఈలకు ఇక సమయానికి చెల్లింపులు