Share News

Bank Holidays: జులై 2024లో బ్యాంకు సెలవులివే..ఈసారి ఎన్ని రోజులంటే

ABN , Publish Date - Jul 01 , 2024 | 10:04 AM

జులై (July 2024) నెల వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays: జులై 2024లో బ్యాంకు సెలవులివే..ఈసారి ఎన్ని రోజులంటే
bank holidays in july 2024

జులై (July 2024) నెల వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చెక్కులు జమ చేయడం, ఒకరి ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ చేయడం వంటి అనేక లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లే వారు ఈ సెలవుల గురించి తప్పక తెలుసుకోవాలి.

ఎందుకంటే బ్యాంకు హాలిడేల గురించి తెలియకుండా సెలవు రోజు మీ బ్యాంకు పనుల కోసం వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో భారత రిజర్వ్ బ్యాంక్(RBI) ప్రకారం ఈ నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి.


జులై 2024 బ్యాంకు సెలవుల జాబితా

  • జులై 3, 2024న బెహ్ డింక్లామ్ పండుగ కారణంగా మేఘాలయ షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు

  • జులై 6, 2024న MHIP డే నేపథ్యంలో మిజోరాం ఐజ్వాల్‌లో బ్యాంకులకు హాలిడే

  • జులై 7, 2024న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • జులై 8, 2024న కాంగ్ రథ యాత్ర సందర్భంగా మణిపూర్ ఇంఫాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి

  • జులై 9, 2024న ద్రుక్పా త్సే జీ సందర్భంగా సిక్కిం గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు

  • జులై 13, 2024న రెండవ శనివారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే


  • జులై 14, 2024 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • జులై 16, 2024న హరేలా సందర్భంగా ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి

  • జులై 17, 2024న మొహర్రం సందర్భంగా అహ్మదాబాద్, పనాజీ, భువనేశ్వర్, చండీగఢ్, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కొచ్చి, కోహిమా, త్రివేండ్రం మినహా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు

  • జులై 21, 2024న ఆదివారం దేశవ్యాప్తంగా హాలిడే

  • జులై 27, 2024న నాల్గవ శనివారం దేశం మొత్తం బ్యాంకులకు సెలవు

  • జులై 28, 2024న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి


సెలవుల్లో కూడా ఈ పనులు

మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులు వచ్చాయి. ఇప్పుడు వినియోగదారులు బ్యాంకులకు సెలవులు(Holidays) ఉన్నా కూడా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా సెలవు దినాల్లో కూడా ఖాతాల నుంచి డబ్బును బదిలీ చేసుకోవచ్చు. దీంతోపాటు నగదు ఉపసంహరణ కోసం మీరు ATMని కూడా ఉపయోగించవచ్చు.


ఇది కూడా చదవండి:

LPG Gas: గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు


Gold and Silver Prices Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


For Latest News and Business News click here

Updated Date - Jul 01 , 2024 | 10:21 AM