Share News

బ్యాంక్‌, ఐటీ రంగాల్లో బేరి్‌షనెస్‌!

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:37 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిలకు చేరటంతో కరెక్షన్‌కు ఆస్కారం ఉంది. అయితే కొత్త ప్రభుత్వ విధానాలు...

బ్యాంక్‌, ఐటీ రంగాల్లో బేరి్‌షనెస్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిలకు చేరటంతో కరెక్షన్‌కు ఆస్కారం ఉంది. అయితే కొత్త ప్రభుత్వ విధానాలు, జీఎ్‌సటీ మండలి తీసుకున్న నిర్ణయాలను బట్టి వాటి గమనం ఉంటుంది. నిఫ్టీకి 23,440 పాయింట్ల వద్ద బలమైన మద్దతు ఉంది. ఒకవేళ ఈ స్థాయిలను బ్రేక్‌ చేయలేని పక్షంలో 23,370/23,390/ 23,180 స్థాయిలకు రావచ్చు. వ్యవసాయ, పురుగు మందులు, ఎరువులు, రియల్టీ, ఇన్‌ఫ్రా షేర్లకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌, ఐటీ రంగాల్లో బేరి్‌షనెస్‌ కనిపిస్తోంది.


స్టాక్‌ రికమండేషన్స్‌

జెఎ్‌సడబ్ల్యూ స్టీల్‌: కొన్నాళ్లుగా సైడ్‌వే్‌సలో చలిస్తూ వస్తున్న ఈ కౌంటర్‌లో మళ్లీ మూమెంటమ్‌ కనిపిస్తోంది. రూ.915 వద్ద కీలక నిరోధాన్ని బ్రేక్‌ చేసింది. పైగా ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్‌ విపరీతంగా పెరుగుతోంది. కన్సాలిడేషన్‌ పూర్తయినట్లు కనిపిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.936 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.910/930 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.975/1,040 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.870 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌: జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరులో 13 శాతం మేర కరెక్షన్‌ జరిగింది. ప్రస్తుతం రూ.6,000 స్థాయిలో ప్రైస్‌ యాక్షన్‌ జరుగుతోంది. వాల్యూమ్‌ విపరీతంగా నమోదవుతుండటంతో పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉంది. గత శుక్రవారం రూ.6,011 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.6,000/5,960 స్థాయిల్లో ప్రవేశించి రూ.6,255 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.5,910 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఆర్‌వీఎన్‌ఎల్‌: ఈ కౌంటర్‌లో అనేక సానుకూలతలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వేకు ప్రాధాన్యతను కొనసాగించటం, కొత్త ఆర్డర్లు రావటంతో షేరు ధర పుంజుకుంటోంది. పైగా అవసరమైన కరెక్షన్‌ కూడా జరిగింది. క్రితం వారం నెల గరిష్ఠాలను బ్రేక్‌ చేసింది. గత శుక్రవారం ఈ షేరు రూ.409 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.405 శ్రేణిలో ప్రవేశించి రూ.425/433 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.400 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


గ్రాన్యూల్స్‌ ఇండియా: కన్సాలిడేషన్‌ అనంతరం ఈ షేరు సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని చేరుకుంది. మంచి వాల్యూమ్‌ జనరేట్‌ అవుతోంది. పైగా అనిశ్చితి తక్కువగా ఉంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.490 వద్ద ముగిసింది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.480 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.555/575 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.465 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బయోకాన్‌: ఈ షేరు మంచి అప్‌ట్రెండ్‌ను కనబరుస్తోంది. తాజా త్రైమాసిక ఫలితాల తర్వాత అక్యుములేషన్‌ జరిగింది. పైగా రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.345 వద్ద ఈ కౌంటర్‌లోకి ఇన్వెస్టర్లు రూ.330 స్థాయిల్లో ఎంటరై రూ.455/475 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.309 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

Updated Date - Jun 24 , 2024 | 06:37 AM