Share News

బెంజ్‌ సరికొత్త ఈవీ

ABN , Publish Date - Sep 17 , 2024 | 04:08 AM

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) శ్రేణిని మరింత విస్తరించింది. దేశీయంగా తయారుచేసిన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘ఈక్యూఎస్‌ 580 4మ్యాటిక్‌’ను సోమవారం విడుదల...

బెంజ్‌ సరికొత్త ఈవీ

ధర రూ.1.41 కోట్లు

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) శ్రేణిని మరింత విస్తరించింది. దేశీయంగా తయారుచేసిన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘ఈక్యూఎస్‌ 580 4మ్యాటిక్‌’ను సోమవారం విడుదల చేసింది. కేవలం ఒకే వేరియంట్‌లో లభించే ఈ కారు ధర రూ.1.41 కోట్లు. ఈ కారు బ్యాటరీ ప్యాక్‌పై 10 ఏళ్ల వారంటీ కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కారు గంటకు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.7 సెకండ్లలో అందుకోగలదని, గరిష్ఠంగా గంటకు 210 కి.మీ వేగంతో ప్రయాణించగలదని బెంజ్‌ తెలిపింది. అంతేకాదు, బ్యాటరీ పూర్తి చార్జింగ్‌తో 809 కి.మీ వరకు ప్రయాణించగలదట.


200 కిలోవాట్‌ డీసీ ఫాస్ట్‌ చార్జర్‌తో కేవలం 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జింగ్‌ అవుతుందని, ఇంట్లో 7.4 కిలోవాట్‌ ఏసీ చార్జర్‌తో చార్జ్‌ చేయడానికి మాత్రం 18.5 గంటలు పడుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

Updated Date - Sep 17 , 2024 | 04:09 AM