Share News

అప్రమత్తంగా ఉండటం బెటర్‌.!

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:59 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. గత వారం విపరీతంగా పతనమైన బెంచ్‌మార్క్‌ సూచీల్లో పుల్‌బ్యాక్‌ ర్యాలీకి ఆస్కారం కనిపిస్తోంది....

అప్రమత్తంగా ఉండటం బెటర్‌.!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. గత వారం విపరీతంగా పతనమైన బెంచ్‌మార్క్‌ సూచీల్లో పుల్‌బ్యాక్‌ ర్యాలీకి ఆస్కారం కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం డేటా కీలకంగా ఉండనుంది. విదేశీ సంస్థాగత మదుపరు లు.. పెట్టుబడుల ఉపసంహరణకు దిగటం, డాలర్‌ మరిం త బలపడుతుండటం ఆందోళన కలిగించే అంశం. సూ చీలు బాగా పడిపోవటంతో ఆకర్షణీయమైన ధరల్లో లభించే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయటం బెటర్‌.


స్టాక్‌ రికమండేషన్స్‌

రెలిగేర్‌: కొన్ని నెలలుగా ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తోంది. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా కదలాడుతోంది. అమ్మకాలు, ఈపీఎస్‌ క్రమంగా పెరుగుతున్నాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు పతనమవుతున్నప్పుడు ఈ షేరు లాభాలను నమోదు చేసింది. రూ.300 వద్ద కీలకమైన నిరోధాన్ని అధిగమించిన ఈ కౌంటర్‌ గత శుక్రవారం 272 శాతం లాభంతో రూ.309 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.300 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.345 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.290 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవా

లి.

కార్‌ట్రేడ్‌: ఈ షేరు 2021 నాటి ఐపీఓ స్థాయికి చేరుకుంది. నిఫ్టీతో పోలిస్తే అత్యంత పటిష్ఠంగా ఉంది. కంపెనీ ఆర్థిక ఫలితాలు ప్రతి త్రైమాసికంలో మెరుగ్గా ఉంటుండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం 5.08 శాతం లాభంతో రూ.1,551 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లోకి రూ.1,585 వద్ద ఎంటరై రూ.1,650/1,775 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,550 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


కేఈసీ ఇంటర్నేషనల్‌: ఫండమెంటల్స్‌, టెక్నికల్స్‌ మంచిగా ఉండటంతో ఈ షేరు దూకుడును ప్రదర్శిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ చాలా ఎక్కువగా ఉంది. నష్టాల మార్కెట్లోనూ ఇవి బలం ప్రదర్శించాయి. చివరి మూడు సెషన్లలో 10 శాతం మేర పెరిగాయి. గత శుక్రవారం 2.78 శాతం లాభంతో రూ.1,236 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లోకి ఇన్వెస్టర్లు రూ.1,200 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,320/1,350 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,170 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: ఆగస్టులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ కౌంటర్‌లో మంచి దిద్దుబాటు కనిపించింది. షేర్ల సరఫరా తగ్గటంతో డిమాండ్‌ పెరుగుతోంది. రిస్క్‌ రివార్డు నిష్పత్తి బాగుంది. గత శుక్రవారం ఈ షేరు రూ.336 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.333 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.375 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.328 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌: జూలైలో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు 50 శాతం మేర పతనమైంది. నవంబరు చివరి వారం నుంచి టర్న్‌ అరౌండ్‌ అయ్యింది. ప్రస్తుతం రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. మూమెంటమ్‌ పుంజుకుంటోంది. గత శుక్రవారం రూ.1,239 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,250 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,400 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,210 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబ

డి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - Dec 23 , 2024 | 12:59 AM