హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కేంద్రం సందర్శించిన బిల్‌గేట్స్
ABN , Publish Date - Feb 29 , 2024 | 04:46 AM
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియా డెవల్‌పమెంట్ సెంటర్‌ను (ఐడీసీ) సందర్శించారు. ఐడీసీ ఏర్పాటై 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా...
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియా డెవల్‌పమెంట్ సెంటర్‌ను (ఐడీసీ) సందర్శించారు. ఐడీసీ ఏర్పాటై 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ కేంద్రాన్ని సందర్శించిన గేట్స్ కొందరు మేథోవంతులైన ఇంజనీరింగ్ సిబ్బందితో భేటీ అయ్యారు. కృత్రిమ మేధ (ఏఐ) చోదక భారతదేశానికి అవకాశాలు అపారంగా ఉన్నాయన్న ఆశాభావం ప్రకటించారని మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బిల్ గేట్స్ ఆకాంక్షలను అనుగుణంగా ఏఐ, క్లౌడ్, సెక్యూరిటీ, గేమింగ్ విభాగాల్లో ఐడీసీ మరింతగా కృషి చేస్తుందని చెప్పారు. 1998లో ఇన్నోవేషన్ కేంద్రంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో బిల్ గేట్స్ ఈ కేంద్రాన్ని స్థాపించారని పేర్కొన్నారు. ఈ 25 సంవత్సరాల కాలంలో అజ్యూర్, విండోస్, ఆఫీస్, బింజ్, కోపైలట్ వంటి ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు, ఏఐ అప్లికేషన్ల అభివృద్ధిలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించిందని ఆ ప్రకటనలో తెలిపారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల కూడా తన ఇటీవలి పర్యటనలో ఏఐలో భారత్‌కు అపార అవకాశాలున్న విషయం ప్రస్తావించారని గుర్తు చేశారు.