బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ టెక్నాలజీ
ABN , Publish Date - Aug 07 , 2024 | 02:36 AM
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సరికొత్త బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది..

అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సరికొత్త బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పీబీఏటీ అనే బయోడీగ్రేడబుల్ పాలిమర్ సాయంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త డాక్టర్ కే వీరబ్రహ్మం నాయకత్వంలోని బృందం ఈ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పెట్రోలియం ఉత్పత్తులు లేదా వృక్ష ఆధారిత నూనెల నుంచి ఈ పాలిమర్‌ను సేకరిస్తారు. ఈ పాలిమర్ ద్వారా తయారు చేసే బ్యాగులు మూడు నెలల్లో భూమిలో కుళ్లిపోతాయని వీరబ్రహ్మం చెప్పారు. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదన్నారు. డీఆర్‌డీఓ ఈ టెక్నాలజీని ఇప్పటికే నలభైకి పైగా కంపెనీలకు బదిలీ చేసింది.