Share News

బిట్‌కాయిన్‌ బిరబిరా..

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:14 AM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికవడం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు సరికొత్త ఊపునిచ్చింది. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ 90,000 డాలర్లకు చేరువైంది. సోమవారం ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్‌ ఏకంగా 10 శాతం వృద్ధితో...

బిట్‌కాయిన్‌ బిరబిరా..

  • 90,000 డాలర్లకు చేరువైన ధర

  • ఒక్కరోజే 10 శాతం పెరుగుదల

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికవడం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు సరికొత్త ఊపునిచ్చింది. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ 90,000 డాలర్లకు చేరువైంది. సోమవారం ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్‌ ఏకంగా 10 శాతం వృద్ధితో 89,623 డాలర్ల వద్ద సరికొత్త ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. మంగళవారం ట్రేడింగ్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ, మున్ముందు సెషన్లలో బిట్‌ కాయిన్‌ సరికొత్త గరిష్ఠాలకు ఎగబాకనుందని క్రిప్టో మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు బిట్‌కాయిన్‌ విలువ 25 శాతానికి పైగా పుంజుకుంది. మరో క్రిప్టో కరెన్సీ ఈథర్‌ ఏకంగా 30 శాతం ఎగబాకింది.


అమెరికాను క్రిప్టోల రాజధానిగా తీర్చిదిద్దుతానని, బిట్‌కాయిన్‌ల వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అవసరమైన విరాళాలను క్రిప్టోల్లోనూ స్వీకరించారు. ట్రంప్‌ సానుకూల వైఖరితో ఈ వర్చువల్‌ కరెన్సీల విలువ మున్ముందు మరింత పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 04:14 AM