బీఓఐ లాభం రూ.2,421 కోట్లు
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:53 AM
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,421 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....
ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,421 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం ఏకంగా 61 శాతం పెరిగింది. కాగా స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ.1,458 కోట్ల నుంచి రూ.2,373 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.16,659 కోట్ల నుంచి రూ.19,872 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం 4ుపెరిగి రూ.5,986 కోట్లుగా నమోదైంది.