Share News

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లావాదేవీ రుసుము సవరణ

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:25 AM

క్యాష్‌, ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ లావాదేవీల రుసుమును సవరిస్తున్నట్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ శుక్రవారం ప్రకటించాయి. సవరించిన రుసుము అక్టోబరు 1 నుంచి అమలులోకి రానుంది. ఈక్విటీ డెరివేటివ్‌ సెగ్మెంట్లో సెన్సెక్స్‌, బ్యాంకెక్స్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టుల లావాదేవీలపై కోటి ప్రీమియం టర్నోవర్‌కు రూ.3,250

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లావాదేవీ రుసుము సవరణ

అక్టోబరు 1 నుంచి అమలు

క్యాష్‌, ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ లావాదేవీల రుసుమును సవరిస్తున్నట్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ శుక్రవారం ప్రకటించాయి. సవరించిన రుసుము అక్టోబరు 1 నుంచి అమలులోకి రానుంది. ఈక్విటీ డెరివేటివ్‌ సెగ్మెంట్లో సెన్సెక్స్‌, బ్యాంకెక్స్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టుల లావాదేవీలపై కోటి ప్రీమియం టర్నోవర్‌కు రూ.3,250 రుసుము వసూలు చేయనున్నట్లు బీఎ్‌సఈ తన సర్క్యులర్‌లో వెల్లడించింది. ఇదే విభాగంలోని ఇతర కాంట్రాక్టుల ఫీజును మాత్రం యథాతథంగా కొనసాగించింది. సెన్సెక్స్‌ 50 ఆప్షన్స్‌, స్టాక్‌ ఆప్షన్స్‌ లావాదేవీలకు కోటి ప్రీమియం టర్నోవర్‌పై రూ.500 రుసుము వసూలు చేయనుంది. ఎన్‌ఎ్‌సఈ విషయానికి వస్తే, క్యాష్‌ మార్కెట్‌ విభాగంలో లక్ష విలువైన లావాదేవీపై రూ.2.97 రుసుము వసూలు చేయనుంది. ఈక్విటీ ఫ్యూచర్స్‌లో లక్ష విలువైన లావాదేవీపై రూ.1.73, ఈక్విటీ ఆప్షన్స్‌కు లక్ష ప్రీమియం వేల్యూపై రూ.35.03 వసూలు చేయనుంది. కరెన్సీ డెరివేటివ్‌ సెగ్మెంట్లో ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులకు లక్ష విలువైన ట్రేడ్‌పై రూ.0.35 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆప్షన్స్‌ కాంట్రాక్టులకు లక్ష ప్రీమియం విలువపై రూ.31.10 రుసుము వసూలు చేయన్నుట్లు ఎన్‌ఎ్‌సఈ తెలిపింది.

Updated Date - Sep 28 , 2024 | 05:25 AM