ఆగస్టు నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు !
ABN , Publish Date - May 07 , 2024 | 03:01 AM
ప్రభుత్వ రంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఎట్టకేలకు 4జీ సేవల్లోకి ప్రవేశిస్తోంది. ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించనున్నట్టు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఎట్టకేలకు 4జీ సేవల్లోకి ప్రవేశిస్తోంది. ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించనున్నట్టు పేరు చెప్పేందుకు ఇష్టపడని బీఎస్ఎన్ఎల్ అధికార వర్గాలు చెప్పాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ పూర్తిగా దేశీయంగా సమకూర్చుకుంటోంది. సీ-డాట్, టీసీఎస్, ఐటీఐ సమకూర్చిన సాఫ్ట్వేర్, పరికరాలతో కంపెనీ గత ఏడాది కాలంగా పంజాబ్ సర్కిల్‌తో పాటు మరికొన్ని సర్కిళ్లలో 4జీ సేవలు అందిస్తోంది. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో ఆగస్టులో దేశ వ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ 4జీ పరికరాలను అవసరమైతే 5జీ సేవలకు కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెప్పాయి.