BSNL: సామాన్యుడి కోసం బీఎస్‌ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేయిస్తే సంవత్సరమంతా ఫ్రీ
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:24 PM
BSNL తన వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 1198 రీఛార్జ్ తో 365 రోజుల వ్యాలిడిటీ ఉండేలా ప్లాన్‌ను ప్రారంభించింది.
సామాన్యుడి కోసం టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్‌లతో పాటు కీ ప్యాడ్ ఫోన్లకు రీఛార్జ్ చేయాలంటే నెలకు రూ.200 కంటే తక్కువలో ఏ ప్లాన్ అందుబాటులో లేదు. దీంతో సామాన్య ప్రజలు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే తెగ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారి కోసం బీఎస్‌ఎన్‌ఎల్ నెలకు రూ.వంద కంటే తక్కువతో ఓ అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవుట్ గోయింగ్ కాల్స్ ఎక్కువ అవసరం లేకుండా, ఇన్ కమింగ్ కాల్స్ వస్తే చాలనుకునేవాళ్లకు, డేటా ఎక్కువుగా ఉపయోగించని మొబైల్ వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో మొబైల్ ప్రీఫెయిడ్ రీఛార్జీలు పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫోన్ రీఛార్జ్ అంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బీఎస్‌ఎన్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ఏమిటో తెలుసుకుందాం.
బంపర్ ఆఫర్
BSNL తన వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 1198 రీఛార్జ్ తో 365 రోజుల వ్యాలిడిటీ ఉండేలా ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి ప్రజలకు ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడం భారంగా మారింది.ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఏడాదికి రూ.1198 ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ వైపు ఎక్కువమంది మొబైల్ వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్లాన్ ప్రయోజనాలు..
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన రూ.1198 రీఛార్జ్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌ను వినియోగదారుడు తీసుకుంటే దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్‌కు అయినా కాల్ చేసి ప్రతి నెలా 300 నిమిషాల పాటు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ లో ప్రతి నెలా 3GBహై స్పీడ్ 3G/4G డేటాను అందిస్తుంది. ప్రతి నెలా 30 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా పంపించుకునే సౌకర్యాన్ని ఈ ప్లాన్‌లో కల్పించారు. అలాగే రూ.1999తో అందించే బీఎస్‌ఎన్‌ఎల్ ఒక సంవత్సరం ప్లాన్ ధరను సంస్థ తగ్గించింది. ఇంతకు ముందు రూ. 1999 ఉండగా ఇప్పుడు రూ. 100 తగ్గించి. రూ. 1899కే ఏడాది ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న కొత్త ప్లాన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రయివేట్ కంపెనీలతో పోటీపడేలా రీఛార్జ్ ప్లాన్స్‌ను బీఎస్‌ఎల్ సంస్థ అందిస్తోంది. రానున్న రోజుల్లో నెట్‌వర్క్ సమస్యను అధిగమిస్తామని సంస్థ ప్రకటించింది.
Also Read: For More National News and Telugu News..
భూమిపై చలామణీలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా.. గూగుల్‌కు రష్యా బిగ్ షాక్
డబ్బా కొట్టుడు ఆపండి.. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్
రుషికొండ ప్యాలెస్ చూసిన తర్వాత చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉందంటే..