Share News

నిర్ణయాత్మక దిశ దొరికేనా...

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:20 AM

ఈక్విటీ మార్కెట్‌ ఈ వారం రేంజ్‌ బౌండ్‌ నుంచి బుల్లి ష్‌గా ట్రేడ్‌ కావచ్చు. అయితే నిర్ణయాత్మక దిశ మాత్రం ఏర్పడకపోవచ్చు. గత శుక్రవారం సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. భారీ నష్టాల నుంచి అనూహ్యంగా....

నిర్ణయాత్మక దిశ దొరికేనా...

ఈక్విటీ మార్కెట్‌ ఈ వారం రేంజ్‌ బౌండ్‌ నుంచి బుల్లి ష్‌గా ట్రేడ్‌ కావచ్చు. అయితే నిర్ణయాత్మక దిశ మాత్రం ఏర్పడకపోవచ్చు. గత శుక్రవారం సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. భారీ నష్టాల నుంచి అనూహ్యంగా లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగవుతుండడం, క్రూడాయిల్‌ ధరల్లో స్థిరత్వం, విదేశీ సంస్థాగత మదుపరులు తిరిగి వస్తుండడం ఇందుకు దోహదపడ్డ కీలకాంశాలు. క్రితం వారం కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఐటీ, టూరిజం, మెటల్‌, రియల్టీ రంగాల షేర్లు రాణించాయి. మీడియా, ఎనర్జీ, పీఎ్‌సయూ బ్యాం కులు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా షేర్లు నష్టపోయాయి.


స్టాక్‌ రికమండేషన్స్‌

క్రిసిల్‌: ఈ రేటింగ్‌ కంపెనీ షేర్లు చక్కని మూమెంటమ్‌ కనబరుస్తున్నాయి. నిఫ్టీతో పోలిస్తే జోరుమీదున్నాయి. రిస్క్‌ రివార్డ్‌ అనుకూలంగా ఉంది. ఏడాదిన్నర నిరోధాన్ని అధిగమించడమే కాకుండా పై స్థాయిలో నిలదొక్కుకుంటున్నాయి. గత శుక్రవారం ఈ షేరు 5.27 శాతం లాభంతో రూ.5817 వద్ద ముగిసింది. రూ.6250/6300 టార్గెట్‌తో రూ.5800 శ్రేణిలో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.5720.

భారతీ ఎయిర్‌టెల్‌: ఆర్పూ పెరగడం, టెలికాం రంగంలో ఎఫ్‌పీఐలు పొజిషన్లు తీసుకుంటుండడంతో ఇన్వెస్టర్లు ఈ షేరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మూమెంటమ్‌, ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్‌ క్రమంగా పెరుగుతున్నాయి. చివరి 2 సెషన్లలోనే 8శాతం మేరకు పెరిగిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1750/1800 టార్గెట్‌తో రూ.1650 స్థాయిలో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.1610.


ఇండియన్‌ హోటల్స్‌: పెళ్లిళ్ల సీజన్‌ కావడం, ఈపీఎస్‌, అమ్మకాల వృద్ధిరేటు గణనీయంగా పెరగడంతో ఈ షేరు జోరుమీదుంది. నిఫ్టీతో పోల్చితే అత్యధిక రాబడి అందిస్తోంది. త్రైమాసిక ఫలితాలు వెలువడిన అనంతరం డెలివరీ వాల్యూమ్‌ విపరీతంగా పెరిగింది. గత శుక్రవారం 2.26 శాతం లాభంతో రూ.855 వద్ద ముగిసింది. రూ.980 టార్గెట్‌ ధరతో రూ.830 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.800.

భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌: జూన్‌ త్రైమాసిక ఫలితాలు నిరాశావహంగా ఉండడంతో ప్రారంభమైన డౌన్‌ట్రెండ్‌ సెప్టెంబరు ఫలితాల తర్వాత నిలిచిపోయింది. రూ.1000 వద్ద ఈ షేరు టర్న్‌ అరౌండ్‌ అయి రూ.1200 వద్ద నిరోధాన్ని అధిగమించింది. డిఫెన్స్‌ రంగం మళ్లీ పుంజుకోవడంతో ఈ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. శుక్రవారం ఈ షేరు రూ.1260 వద్ద ముగిసింది. రూ.1450 టార్గెట్‌ ధరతో రూ.1200 వద్ద ప్రవేశించవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.1140.


బజాజ్‌ ఫిన్‌సర్వ్‌: 40 సెషన్లుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి 17 శాతం దూరంలో ఉంది. డిసెంబరు నుంచి మళ్లీ మూమెంటమ్‌ పెరిగింది. రూ.1550 స్థాయిలో మద్దతు తీసుకుని వరుస లాభాల్లో ముగుస్తోంది. గత శుక్రవారం ముగింపు రూ.1679. ఇన్వెస్టర్లు రూ.1960 టార్గెట్‌తో రూ.1650 వద్ద పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.1600.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - Dec 16 , 2024 | 05:20 AM