Share News

న్యూలాండ్‌ ల్యాబ్స్‌కు క్యాపిటల్‌ గ్రూప్‌ గుడ్‌బై

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:24 AM

హైదరాబాద్‌కు చెందిన న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ నుంచి అమెరికాకు చెందిన క్యాపిటల్‌ గ్రూప్‌ పూర్తిగా వైదొలిగింది. న్యూలాండ్‌లో తనకున్న 3.77 శాతం వాటాను...

న్యూలాండ్‌ ల్యాబ్స్‌కు క్యాపిటల్‌ గ్రూప్‌ గుడ్‌బై

3.77% వాటా రూ.756 కోట్లకు విక్రయం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ నుంచి అమెరికాకు చెందిన క్యాపిటల్‌ గ్రూప్‌ పూర్తిగా వైదొలిగింది. న్యూలాండ్‌లో తనకున్న 3.77 శాతం వాటాను రూ.756 కోట్లకు విక్రయించింది. బహిరంగ మార్కెట్లో బల్క్‌ డీల్స్‌ ద్వారా ఈ వాటాను ఉపసంహరించుకుంది. ఎన్‌ఎ్‌సఈ డేటా ప్రకారం.. 3.77 శాతం వాటాకు సమానమైన 4.84 లక్షల షేర్లను ఒక్కొక్కటి సగటున రూ.15,618.16కు విక్రయించింది. ఎన్‌ఎ్‌సఈలో న్యూలాండ్‌ షేరు 5.54 శాతం నష్టంతో రూ.16,014.95 వద్ద ముగిసింది.

Updated Date - Dec 13 , 2024 | 02:24 AM