Share News

రిలయన్స్‌-వాల్ట్‌ డిస్నీ విలీనానికి సీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:57 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌-వాల్ట్‌ డిస్నీ మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు...

రిలయన్స్‌-వాల్ట్‌ డిస్నీ విలీనానికి సీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌

రూ.70,000 కోట్ల భారీ మీడియా వెంచర్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌-వాల్ట్‌ డిస్నీ మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 63.16 శాతం, వాల్ట్‌ డిస్నీకి 36.84 శాతం వాటా ఉంటుంది. ఇక ఈ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదమే తరువాయి. ఎన్‌సీఎల్‌టీ కూడా ఆమోదం తెలిపితే దేశంలో రూ.70,000 కోట్ల భారీ మీడియా వెంచర్‌ ఏర్పడనుంది. అదే జరిగితే వీక్షకులకు రెండు స్ట్రీమింగ్‌ సర్వీసులు, 120కిపైగా టీవీ ఛానల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. సోనీ, నెట్‌ఫ్లిక్స్‌లతో పోటీ పడేందుకు వీలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ జాయిట్‌ వెంచర్‌ కంపెనీలో రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Updated Date - Aug 29 , 2024 | 03:57 AM