Share News

Coconut : పెరిగిన కొబ్బరి కనీస మద్దతు ధర

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:25 AM

వచ్చే 2025 సీజన్‌కు కొబ్బరి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం రూ.12,100కు పెంచింది. ఈ సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.422 ఎక్కువ. ప్రధాని నరేంద్ర

Coconut : పెరిగిన కొబ్బరి కనీస మద్దతు ధర

న్యూఢిల్లీ: వచ్చే 2025 సీజన్‌కు కొబ్బరి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం రూ.12,100కు పెంచింది. ఈ సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.422 ఎక్కువ. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొత్త ఎంఎస్‌పీ ప్రకారం క్వింటా ఎండు కొబ్బరి చిప్పల (మిల్లింగ్‌ కోప్రా) ధరను రూ.11,160 నుంచి రూ.11,582కు, కురిడీల (బాల్‌ కోప్రా) ధరను రూ.12,000 నుంచి రూ.12,100కు పెంచినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. ఈ నిర్ణయంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని కొబ్బరి రైతులకు మేలు జరగనుంది.

Updated Date - Dec 21 , 2024 | 04:25 AM