మహీంద్రా క్రిష్-ఈతో కోరమాండల్ జట్టు
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:32 AM
వ్యవసాయ రంగానికి అవసరమైన పరిష్కారాలు అందించడంలో పేరెన్నిక గన్న కోరమాండల్ ఇంటర్నేషనల్.. మహీం ద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పరికరాల విభాగం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వ్యవసాయ రంగానికి అవసరమైన పరిష్కారాలు అందించడంలో పేరెన్నిక గన్న కోరమాండల్ ఇంటర్నేషనల్.. మహీం ద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పరికరాల విభాగం అనుబంధ సంస్థ అయిన క్రిష్-ఈ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద కోరమాండల్ డ్రోన్ స్ర్పేయింగ్ సర్వీసు గ్రోమోర్ డ్రైవ్‌ను విస్తరిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కోరమాండల్ డ్రోన్ సర్వీసెస్ తన అనుబంధ సంస్థ దక్ష మానవరహిత వ్యవస్థ ద్వారా డ్రోన్ల సరఫరా, పైలట్ శిక్షణ, సర్వీస్ మద్దతు అందిస్తోంది. క్రిష్-ఈ కస్టమర్లు క్రిష్-ఇ ఖేతీ కేలియే యాప్ ద్వారా ఫీజు చెల్లింపు ప్రాతిపదికన డ్రోన్ స్ర్పేయింగ్ సేవలు పొందవచ్చు.