కస్టమర్ రేటింగ్‌లో లవ జోరు
ABN , Publish Date - Jan 29 , 2024 | 05:46 AM
కస్టమర్ రేటింగ్‌లో దేశీయ స్మార్ట్ ఎలక్ర్టానిక్స్ కంపెనీలు లవ, క్యూబో అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడుతున్నాయి. మార్కెట్ అనాల్సిస్ కంపెనీ టెక్‌ఆర్క్ బ్రాండ్ ఆమోదనీయత నివేదికను విడుదల చేసింది...
న్యూఢిల్లీ: కస్టమర్ రేటింగ్‌లో దేశీయ స్మార్ట్ ఎలక్ర్టానిక్స్ కంపెనీలు లవ, క్యూబో అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడుతున్నాయి. మార్కెట్ అనాల్సిస్ కంపెనీ టెక్‌ఆర్క్ బ్రాండ్ ఆమోదనీయత నివేదికను విడుదల చేసింది. ఇ-కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై 25 బ్రాండ్లకు చెందిన 35 విభిన్న ఉత్పత్తులపై డిసెంబరులో కస్టమర్లు ఇచ్చిన రేటింగ్ తీరుతెన్నులను ఈ సంస్థ అధ్యయనం చేసింది. అంతర్జాతీయ బ్రాండ్లయిన రియల్ మీ, రెడ్ మీ వంటివి పొందిన సగటు వెయిటెజ్ రేటింగ్ 4.3 ఉండగా లవ 4.2 రేటింగ్ సాధించింది. అంటే ఆ బ్రాండ్లకు గట్టి పోటీదారుగా మారింది. లవకు అత్యున్నత రేటింగ్ (4, 5) 90.2 శాతం ఉండగా గ్లోబల్ బ్రాండ్లకు అది 75.8 శాతం ఉంది. ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో హీరో గ్రూప్ కంపెనీ క్యూబోను పరిగణనలోకి తీసుకుంది. పరిశ్రమ సగటు రేటింగ్ 4 ఉండగా క్యూబో 4.1 రేటింగ్ పొందింది.