Share News

స్విగ్గీ లాభాల డెలివరీ

ABN , Publish Date - Nov 14 , 2024 | 03:41 AM

ఫుడ్‌ డెలివరీతోపాటు క్విక్‌ కామర్స్‌ సేవలం దిస్తున్న స్విగ్గీ లిస్టింగ్‌కు ప్రతికూల మార్కెట్‌ పరిస్థితుల్లో నూ మంచి స్పందన లభించింది. ఐపీఓ ధర రూ.390తో పోలిస్తే, బీఎస్‌ఈలో కంపెనీ షేరు 5.64 శాతం లాభంతో....

స్విగ్గీ లాభాల డెలివరీ

లిస్టింగ్‌ రోజున 17 శాతం పెరిగిన కంపెనీ షేరు

రూ.లక్ష కోట్లు దాటిన సంస్థ మార్కెట్‌ క్యాప్‌

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీతోపాటు క్విక్‌ కామర్స్‌ సేవలం దిస్తున్న స్విగ్గీ లిస్టింగ్‌కు ప్రతికూల మార్కెట్‌ పరిస్థితుల్లో నూ మంచి స్పందన లభించింది. ఐపీఓ ధర రూ.390తో పోలిస్తే, బీఎస్‌ఈలో కంపెనీ షేరు 5.64 శాతం లాభంతో రూ.412 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఆ తర్వాత మరింత పుంజుకొని ఒక దశలో 19.30 శాతం వృద్ధితో రూ.465.30 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి స్విగ్గీ షేరు 16.91 శాతం లాభంతో రూ.455.95 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైంది. గత వారంలో ముగిసిన రూ.11,327 కోట్ల స్విగ్గీ ఐపీఓకు సైతం ఇష్యూ సైజుతో పోలిస్తే 3.59 రెట్ల స్పందన లభించింది. స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ సంద ర్భంగా స్విగ్గీకి తన ప్రత్యర్థి సంస్థ జొమాటో సీఈఓ దీపీందర్‌ గోయల్‌ శుభాభినందనలు తెలియజేశారు.


వచ్చే 3-5 ఏళ్లు బలమైన వృద్ధి: సీఈఓ శ్రీహర్ష

వచ్చే 3-5 ఏళ్లపాటు సంస్థ వ్యాపారం బలమైన వృద్ధిని నమోదు చేసుకోనుందని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి ధీమా వ్యక్తం చేశారు. అలాగే, తన క్విక్‌ కామర్స్‌ విభా గమైన ఇన్‌స్టామార్ట్‌ నెట్‌వర్క్‌, సేవల పరిధి, గిడ్డంగులను మరింత విస్తరిస్తామని మార్కెట్‌ లిస్టింగ్‌ అనంతరం శ్రీహర్ష వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్న ఉత్పత్తుల విభాగాలను రెట్టింపు చేసినట్లు ఆయన చెప్పారు.


మిలియనీర్లుగా 70 మంది ఉద్యోగులు

స్విగ్గీ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌తో కంపెనీకి చెందిన 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులుగా అవతరించగా.. అందులో 70 మంది మిలియనీర్లుగా (10 లక్షల డాలర్లు= రూ.8.4 కోట్లు) మారారు. సంస్థకు చెందిన 5,000 మంది ఉద్యోగులకు మొత్తం రూ.9,000 కోట్ల సంపద సమకూ రింది. గతంలో స్విగ్గీ వీరికి ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఆప్షన్స్‌ (ఈసాప్స్‌) కింద షేర్లను కేటాయించింది. ఈసాప్స్‌ షేర్ల తాజా విలువ కంపెనీ సిబ్బందిని కోటీశ్వరులు, లక్షాధికారులను చేసింది.

Updated Date - Nov 14 , 2024 | 03:41 AM