ఫోన్ పే నుంచి డెంగ్యూ, మలేరియా బీమా
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:32 AM
ఫోన్ పే నుంచి డెంగ్యూ, మలేరియా బీమా అందుబాటులోకి వచ్చింది. ఏడాదికి కేవలం రూ.59 ప్రీమియంతోనే దీన్ని ప్రవేశపెట్టినట్టు ఫోన్ పే ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : ఫోన్ పే నుంచి డెంగ్యూ, మలేరియా బీమా అందుబాటులోకి వచ్చింది. ఏడాదికి కేవలం రూ.59 ప్రీమియంతోనే దీన్ని ప్రవేశపెట్టినట్టు ఫోన్ పే ప్రకటించింది. దోమలు, ఇతర క్రిమి కీటకాల (పరాన్నభుక్కుల) ద్వారా వ్యాపించే రోగాలకు తీసుకునే చికిత్సకు ఇది రూ.లక్ష వరకు ఏడాది పొడవునా బీమా రక్షణ కల్పిస్తుంది. అంటే బీమా కవరేజీ రుతుపవనాల కాలానికి మాత్రమే పరిమితం కాదు. ఫోన్ పే కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ప్లాన్ ఆస్పత్రి ఖర్చులు, డయాగ్నోస్టిక్ ఖర్చులు, ఐసీయూ చికిత్స వంటి అన్నింటికీ కవరేజీ కల్పిస్తుంది. ఫోన్ పే యాప్ ద్వారా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. పూర్తిగా డిజిటల్ విధానంలోనే క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది. కార్పొరేట్ ఆరోగ్య బీమా కలిగిన వారు కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చునని ఫోన్ పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశాల్ గుప్తా అన్నారు.