డిపాజిట్ రేట్లు తగ్గాల్సిందే : ఖారా
ABN , Publish Date - Jun 13 , 2024 | 04:26 AM
దేశంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇప్పటికే పతాక స్థాయికి చేరాయని, మధ్యకాలికంగా తగ్గుముఖం పట్టక తప్పదని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా అన్నారు...
న్యూఢిల్లీ: దేశంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇప్పటికే పతాక స్థాయికి చేరాయని, మధ్యకాలికంగా తగ్గుముఖం పట్టక తప్పదని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా అన్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి ఆర్‌బీఐ రెపోరేట్ల తగ్గింపు ప్రారంభించవచ్చునని ఆయన జోస్యం చెప్పారు. అప్పటికి ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ కట్టడి పరిధిలో కనిష్ఠ స్థాయి 4 శాతానికి చేరువ కావచ్చునని ఆయన అన్నారు. గత నెలలో కొన్ని మెచ్యూరిటీలపై ఎఫ్‌డీ రేట్లను ఎస్‌బీఐ 0.75 శాతం మేరకు పెంచింది.