నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌పై డెరివేటివ్ కాంట్రాక్టులు
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:27 AM
ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ పై డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది...
న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ పై డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. సెబీ నుంచి ఇందుకు అనుమతి లభించినట్టు తెలిపింది. ఈ కాంట్రాక్టుల ముగింపు ప్రతి నెలా చివరి శుక్రవారం ఉంటుంది. ఈ ఏడాది మార్చి 29 నాటికి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.70 లక్షల కోట్లు. ఎన్‌ఎ్‌సఈలో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్‌లో ఇది 18 శాతానికి సమానం. ఈ ఇండెక్స్ కంపెనీల్లో రోజూ సగటున రూ.9,560 కోట్ల టర్నోవర్ జరుగుతోంది.