Share News

Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ టైంలో కొనుగోలు చేయాలా? వద్దా?

ABN , Publish Date - Oct 31 , 2024 | 07:01 PM

బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. పండగలు, పబ్బాలు అన్నట్లుగా కాకుండా భారీగా పెరిగింది. దీంతో కిలోలకు కిలోలు బంగారాన్ని కొనుగోలు చేసిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..

Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ టైంలో కొనుగోలు చేయాలా? వద్దా?

పసిడి ధర పై పైకి పరుగులు తీస్తుంది. దీంతో ఇప్పటికే భారీగా బంగారం తమ వద్ద ఉన్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు.. ఇంత ఇంత ధరల్లో ఎలా కొనాలా అని మదన పడుతున్నారు. కానీ దీపావళి వేళ.. బంగారం కొనాలని అంతా భావిస్తారు. బంగారం కొనుగోలుతో భారీగా జేబుకు చిల్లు పడినా... ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయబోతున్నట్లయితే, ముందుగా బంగారం రికార్డు ధర గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.

Also Read: Diwali 2024: నరకాసురుడు ఎవరు ? దీపావళి రోజు అతని దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తారంటే..?


దీపావళి వేళ..

దీపావళి పండగ వేళ.. 10 గ్రాముల బంగారం ధర రూ.79,621 ఉంది. అంటే కేజీ బంగారం కొనుగోలు చేయాలంటే.. దాదాపు రూ.80 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే గత పదేళ్లలో బంగారం ధర భారీగా పెరిగింది. అది కూడా ఎంతగా అంటే.. 200 శాతానికి పైగా పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో.. బంగారం రికార్డు స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలా? అంటే.. చేయాల్సిందేనని మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో బంగారం ధర పెరిగిందే కానీ... కిందకి దిగి వచ్చినట్లు ఎక్కడ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంకా సోదాహరణగా వివరించాలంటే..

Also Read: ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?


2015 నాటి నుంచి నేటి వరకు బంగారం ధరలు..

2015లో 10 గ్రాముల బంగారం ధర రూ.25380 ఉంది. 2016లో రూ.30 వేలకు పెరిగింది. 2017లో రూ.30850గా ఉంది. 2019లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.40 వేలు అయింది. 2020లో కరోనా సమయంలో సైతం బంగారం ధర మాత్రం తగ్గలేదు. బంగారం ధర రూ.52 వేలు దాటింది. 2022లో బంగారం ధర రూ.51 వేలు అయింది. 2023లో రూ. 61 వేలు దాటగా, ఈ ఏడాది రూ. 80 వేలకు చేరి.. బంగారం చరిత్రలో రికార్డు సృష్టించింది.

Also Read: CM Chandrababu: సరిగ్గా ఏడాది.. అంతలో ఎంత తేడా?


రూ. 25 వేల నుంచి రూ. 80 వేలకు..

అంటే 10 ఏళ్లలో రూ.25 వేలు విలువ చేసే బంగారం ధర రూ.80 వేలుకు చేరిందని స్పష్టమవుతుంది. అయితే భవిష్యత్తులో పెట్టుబడికి బంగారం కొనుగోలు చేయడం మంచి నిర్ణయం. అదీకాక భారత్‌లో పండుగల వేళ.. బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది, దీంతో బంగారం ధర చౌకగా ఉన్నా.. లేకుంటే ఖరీదైన డిమాండ్ మాత్రం అలాగే ఉంటుందన్నది సుస్పష్టం.

Also Read: కొత్తిమీర తింటే.. ఇన్ని ప్రయోజనాలున్నాయా?


విదేశాల నుంచి భారత్‌కు టన్నుల కొద్ది బంగారం..

దీపావళి ముందుల ధన త్రయోదశి వస్తుంది. దీంతో బ్రిటన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నుంచి సీక్రెట్‌ మిషన్‌ ద్వారా 102 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకు వచ్చినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. 2022, సెప్టెంబర్ నుంచి దేశంలోకి మొత్తం 214 టన్నుల బంగారాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసం చివరికి ఆర్బీఐ మొత్తం 855 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. వీటిలో 510.5 టన్నులు బంగారం భారతదేశంలో భద్రంగా ఉంది.

Also Read: viral video: దీపావళి పండగ వేళ మామ్మా మజాకా


1990 దశకంలో..

అయితే ఇప్పుడే ఇలా ఎందుకు అంత బంగారాన్ని తీసుకు వస్తున్నారంటే.. దీని వెనుక బలమైన కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య యుద్దాలు జరుగుతున్నాయి. దీంతో భారత్.. తన బంగారాన్ని బయట దేశాల్లో ఉంచడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తుంది. అందులోభాగంగానే విదేశీ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన బంగారాన్ని స్వదేశానికి భారత్ తీసుకు వస్తుంది. 1990వ దశకంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు నాటి ప్రభుత్వం విదేశీ బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టింది. దానిని విదేశాల నుంచి స్వదేశానికి భారత్ తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టింది.

For Business News And Telugu News

Updated Date - Oct 31 , 2024 | 07:06 PM