Share News

షాపింగ్‌ మాయలో పడొద్దు!

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:29 PM

క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి... మరోవైపు పెళ్లిళ్ళ సీజన్‌. మార్కెట్లో షాపింగ్‌ సందడి మొదలైంది. షాపులే కాదు... ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్‌ జాతరే. దుకాణాల్లో షాపింగ్‌ సంగతి అలా ఉంచితే... ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. అందుకోసం వాళ్లు చెబుతున్న చిట్కాలు ఏమిటంటే...

షాపింగ్‌ మాయలో పడొద్దు!

క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి... మరోవైపు పెళ్లిళ్ళ సీజన్‌. మార్కెట్లో షాపింగ్‌ సందడి మొదలైంది. షాపులే కాదు... ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్‌ జాతరే. దుకాణాల్లో షాపింగ్‌ సంగతి అలా ఉంచితే... ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. అందుకోసం వాళ్లు చెబుతున్న చిట్కాలు ఏమిటంటే...

- ‘ఇయర్‌ ఎండ్‌ సేల్‌’ పేరుతో ఈ కామర్స్‌ కంపెనీలు ఊదరగొడతాయి. దేన్ని ఎంచుకోవాలి?

టిప్‌: ఈ-కామర్స్‌ యాప్స్‌ కొనే ప్రతి వస్తువునూ విశ్లేషిస్తాయి. దాని ఆధారంగానే ప్రకటనలు చూపిస్తాయి. అందుకే నిజంగా మీకు కావాల్సిన మోడల్స్‌ సదరు ఆఫర్‌లో ఉన్నాయా? అని ముందుగా చెక్‌ చేసుకోవాలి. నిజంగా మీకు కావాల్సిన వస్తువు, డ్రెస్‌ ఉంటే తక్షణమే ఇతర ఈ కామర్స్‌ కంపెనీలతో పోల్చి చూడండి. ఒరిజినల్‌ రిటైలర్స్‌ మెయిల్స్‌కు పంపించే నోటిఫికేషన్స్‌ ఆన్‌ చేసుకున్నట్లయితే సదరు బ్రాండ్‌కు సంబంధించినదో, కాదో తెలుస్తుంది. అలాగే కచ్చితమైన రేటు అర్థమవుతుంది. ఆయా బ్రాండ్స్‌ను సోషల్‌ మీడియాలో ఫాలో అవ్వండి. అప్పుడే సేల్స్‌ విషయాలు అర్థమవుతాయి.


- పేరున్న బ్రాండ్స్‌ స్పెషల్‌ డిస్కౌంట్స్‌, లాయల్టీ ప్రోగ్రామ్స్‌, కూపన్స్‌ లాంటివి ఆఫర్‌ చేస్తుంటాయి. వీటినుంచి తప్పించుకోవడం ఎలా?

టిప్‌: అవసరం లేకున్నా డిస్కౌంట్స్‌, కూపన్స్‌ ఉన్నాయని కొనవద్దు. దానివల్ల తెలియకుండా నష్టపోతారు. క్రెడిట్‌ కార్డు షాపింగ్‌ ఆధారంగానో... రిటైల్‌ షాప్‌లో మీరు ఇచ్చిన ఫోన్‌ నంబరు ఆధారంగానో నోటిఫికేషన్స్‌ వస్తుంటాయి. పైగా యాప్స్‌ ద్వారా మీరు ఉండే లొకేషన్‌, క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డుతో ఫలానా బ్రాండ్స్‌ కొంటున్నారనే సమాచారం ఆ కంపెనీతో పాటు ఇతర కంపెనీలకు తెలుస్తుంది. కాబట్టి ఫోన్‌నెంబర్స్‌ లేదా ఈమెయిల్స్‌ను షాపింగ్‌మాల్స్‌లో ఇవ్వొద్దు.


- కొన్ని ఈ కామర్స్‌ సంస్థలు మెంబర్‌ షిప్‌ తీసుకుంటే... గ్రాసరీస్‌ డెలివరీ, ఫుడ్‌ డెలివరీ ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ మ్యూజిక్‌, మూవీస్‌ చూసుకునే వీలుంటుంది అని చెబుతుంటాయి. వాటిని నమ్మొచ్చా?

టిప్‌: నిజంగా మీరు తరచూ షాపింగ్‌ చేస్తున్నట్లయితే మెంబర్‌షిప్స్‌తో కచ్చితంగా లాభపడతారు. ఉచితంగానే ఆయా సంస్థల ఇతర సర్వీసులనూ పొందుతారు. అయితే ఫ్రీ మ్యూజిక్‌, సినిమాలను ఎన్నిసార్లు చూస్తారనే విషయాన్ని మీకు మీరే అనాలసిస్‌ చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మెంబర్‌షిప్‌ ఫీజు చెల్లించాక ఆయా సర్వీసులను ఉపయోగించుకోకపోతే మీ సొమ్ము వృథా అయినట్లే.


- కొన్ని సంస్థల రివ్యూలను ఎంతవరకు నమ్మొచ్చు. కొందరు యూట్యూబర్స్‌ ‘ఆహా.. అద్భుతం’ అని చెబుతుంటారు. అవి ఎంత వరకు సరియైునవి?

టిప్‌: ఫలానా ప్యాంట్‌ అద్భుతంగా ఉంది. ఈ షూ తొడిగితే భలే కంఫర్ట్‌.. ఇలాంటి ఫేక్‌ రివ్యూలను నమ్మవద్దు. ఫలానా కంపెనీ వస్తువు బావుంటుందో లేదో మీకైనా అనుభవం ఉండాలి లేదా మీ స్నేహితులు వాడితే దాని గురించి తెలుసుకొని ఉండాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్సీ రోజుల్లో ఫేక్‌ రివ్యూలు ఇచ్చే సంస్థలు పుట్టగొడుగుల్లా వచ్చాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. ఫాక్ట్‌ చెకప్‌ ఉండాలి. నాణ్యత గురించి యూట్యూబర్స్‌, ఇన్‌స్టాలో పెయిడ్‌ ప్రమోషన్స్‌ చేస్తుంటారు. వాటికి దూరంగా ఉంటేనే మేలు.

book10.2.jpg


- ఫిఫ్టీ, సెవెంటీ పర్సెంట్‌ డిస్కౌంట్‌... మతలబు ఏమిటి?

టిప్‌: తక్కువ ధరకు వస్తున్నాయంటే దాని మాన్యుఫాక్చరింగ్‌ తేదీ చేక్‌ చేయాలి. అలాగే ఫిఫ్టీ పర్సెంట్‌ డిస్కౌంట్‌ అంటే చాలాసార్లు ఫ్లాట్‌ కాదని గుర్తించుకోవాలి. ఒకవేళ ఫిఫ్టీ, సెవెంటీ పర్సెంట్‌ డిస్కౌంట్‌ అని చూసినా... ఇంతకుముందు దాని ధర తెలుసుండాలి లేదా ఇతర పోర్టల్స్‌లో పోల్చి చూసుకోవాలి. ఫైనల్‌ సేల్‌ అనే మార్కు ఉందా లేదా చెక్‌ చేయాలి. రిటర్న్‌ బ్యాక్‌ పాలసీ చూడాలి. అలాగైతే నష్టపోరు.


- కొత్తగా వచ్చిన ‘పే లేటర్‌’, ‘లేజీ పే’ జోలికి వెళ్తే మంచిదేనా?

టిప్‌: లేజీ పే, పే లేటర్‌ ఏది చేసినా ఆ క్షణానికి డబ్బులు కట్టలేదు కదా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేనప్పుడు మరీ ఇబ్బందవుతుంది. అందుకే ఆటోమేటిక్‌గా డెబిట్‌ అయ్యే విధంగా యాప్స్‌ సెట్‌ చేసుకోవాలి. అలా కుదరకుంటే వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. పే లేటర్‌ కు ఆన్‌టైమ్‌లో బిల్లు కట్టకపోతే సిబిల్‌ స్కోర్‌ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.


- ఏదైనా కొంటే వారెంటీ ఇస్తుంటారు.. దీని విషయంలో ఎలా ఉండాలి?

టిప్‌: వారంటీలకు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తారు. కొన్ని రిపేర్లు వీటి పరిధిలోకి రాకపోవచ్చు. అందుకే ఇలాంటివాటిని వేస్ట్‌ మనీ వారెంటీలు అనొచ్చు. ఆఫర్‌ వచ్చిందని, వారెంటీ ఉందని వస్తువులను కొనకూడదు. యాడ్స్‌ ఇవ్వకుండా మంచి డిస్కౌంట్స్‌ ఇచ్చే అవుట్‌లెట్స్‌ కూడా ఉంటాయి. వాటిలో షాపింగ్‌ చేయడం ఉత్తమం.

Updated Date - Dec 08 , 2024 | 12:29 PM