Home » Sunday
‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కళకు అనర్హం’ అంటాడు స్కాట్లాండ్కు చెందిన శిల్పకారుడు డేవిడ్ మాక్. అగ్గిపుల్లలతో మహాత్మాగాంధీ, చార్లీచాప్లిన్, మార్లిన్ మన్రో వంటి ప్రసిద్ధుల ప్రతిమలు రూపొందించడంలో దిట్ట ఆయన. మ్యాచ్స్టిక్స్ కళాఖండాల తయారీలో రకరకాల రంగుల్లో లభించే జపాన్ అగ్గిపుల్లలను వినియోగించాడు.
పడవపై కుదురుగా కూర్చుని, తెడ్డేస్తూ నదిలో ఓ పది నిమిషాలు పాటు నడపడమే ఎంతో కష్టం. అలాంటిది గుమ్మడికాయను పడవగా చేసుకొని... దానిపై ఏకధాటిగా 26 గంటల పాటు ప్రయాణించి ‘ఔరా’ అనిపించాడో పెద్దాయన.
విహార ప్రదేశాలంటే అందమైన సరస్సులు, జలపాతాలు, కట్టడాలే కాదు... యుద్ధభేరి మోగిన ప్రాంతాలు, సైనికుల వీరత్వగాధలు, రక్తం ఏరులై పారిన ప్రదేశాలు కూడా... అలాంటి యుద్ధ స్మారకాలను వీక్షిస్తే... ఉద్వేగభరితంగా మారిపోతాం. చరిత్ర ఘటనలను కళ్లకు కట్టేలా లైట్ అండ్ సౌండ్షో రూపంలో చూస్తుంటే... ఆనాటి యుద్ధ స్మృతులు మనల్ని చుట్టుముడతాయి.
ఇంటి కోసమో, పిల్లల కోసమో, గార్డెన్ కోసమో కాకుండా... పెంపుడు జంతువుల కోసం కూడా అనేక గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఉదాహరణకు వాటి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలన్నా, అవి ఏం కోరుకుంటున్నాయో తెలుసు కోవాలన్నా ఇకపై క్షణాల్లో పనే.
నేను కథలు రాస్తానని మా బంధువుల్లో, స్నేహితుల్లో చాలామందికి తెలుసు. కొందరు అప్పడప్పుడు వాళ్ళకు జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి, దీన్ని నువ్వు చక్కని కథగా రాయవచ్చు అంటుంటారు.
కావలసిన పదార్థాలు: లేత నల్లేరు కాడలు - ఒక కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు - పావు కప్పు చొప్పున. మెంతులు - పావు టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి - 10 రెబ్బలు, చింతపండు - చిన్న నిమ్మకాయంత, కరివేపాకు - గుప్పెడు, ఎండుమిర్చి - 15, ఉప్పు - రుచికి.
అనేక యజ్ఞాలు చేసిన మాంధాత పాయసం, అపూపం, మోదకాలతో వేదపండితులకు విందు ఇచ్చినట్టు భారతం ద్రోణపర్వంలో తిక్కనగారి వర్ణన ఇది. ‘‘సూపా పూపై శ్శర్కరాద్యైః పాయసైః ఫలసంయుతైః’’ యజ్ఞానంతరం వేదవిదులకు సూపం (పప్పు), పంచదార చల్లిన అపూపం, పాయసం, పండ్లతో భోజనం పెట్టాలని శంకరాచార్యుల వారు లలితా త్రిశతి భాష్యంలో చెప్పారు. తిక్కన అదే రాశారు.
క్వాలిటీ స్వీట్ అంటే మహా అయితే కిలో వెయ్యి, రెండు వేల రూపాయలకు లభిస్తుంది. జైపూర్లోని ‘త్యోహార్’ అనే మిఠాయి దుకాణం ఒక ప్రత్యేకమైన స్వీటును తయారుచేసి, కిలో ఏకంగా 70 వేల రూపాయలకు అమ్ముతోంది. పది గ్రాముల బంగారం ధరకు ఇంచుమించుగా ఉన్న ఈ ‘గోల్డ్ స్వీట్’ కథేంటీ...
ఒకప్పటిలా కాదిప్పుడు. ఏదైనా చిటికెలో అయిపోవాలి. అంతా ఇన్స్టంట్! చాటింగ్లా ఒక్క ముక్కలో చెప్పాలి. యూట్యూబ్ షార్ట్స్లా అర నిమిషంలో టాలెంట్ చూపించాలి. ఇన్స్టాలో రీల్స్లా అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలంతే! అందుకే నానో కల్చర్ను ఇష్టపడుతోంది కొత్తతరం.
అమరి గుయిచన్... చూడటానికి చాక్లెట్బాయ్లా కనిపిస్తాడు. అయితే నిజంగానే అతడో ‘చాక్లెట్’బాయ్. గుయిచన్ చాక్లెట్ తయారీకి దిగాడంటే మామూలుగా ఉండదు. అది తప్పకుండా ఓ కళాఖండమే అవుతుంది. ఇటీవలే ఈ ‘పేస్ట్రీ చెఫ్’ ప్రపంచంలోనే అతి పెద్ద బనానా చాక్లెట్ తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.