Share News

నెస్లేతో డాక్టర్‌ రెడ్డీస్‌ జేవీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:20 AM

బ్రాండెడ్‌ పోషకాహార ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం నెస్లే ఇండియా-డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒక జాయింట్‌ వెంచర్‌ (జేవీ) కంపెనీని ఏర్పాటు చేస్తున్నాయి...

నెస్లేతో డాక్టర్‌ రెడ్డీస్‌ జేవీ

హైదరాబాద్‌: బ్రాండెడ్‌ పోషకాహార ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం నెస్లే ఇండియా-డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒక జాయింట్‌ వెంచర్‌ (జేవీ) కంపెనీని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం నెస్లే హెల్త్‌సైన్స్‌ కంపెనీకి చెందిన ఎంపిక చేసిన కొన్ని బ్రాండెడ్‌ పోషకాహార ఉత్పత్తులు, డాక్టర్‌ రెడ్డీ్‌సకు చెందిన ఎంపిక చేసిన కొన్ని బ్రాండెడ్‌ పోషకాహార ఉత్పత్తులను ఈ భాగస్వామ్య సంస్థ భారత్‌ సహా మరికొన్ని ఇతర దేశాల్లో మార్కెట్‌ చేస్తుంది.

Updated Date - Apr 26 , 2024 | 04:20 AM