Share News

డ్రోన్‌ టెక్నాలజీ కంపెనీ ఐఓటెక్‌ వరల్డ్‌ ఏవిగేషన్‌

ABN , Publish Date - Oct 06 , 2024 | 01:37 AM

డ్రోన్‌ టెక్నాలజీ కంపెనీ ఐఓటెక్‌ వరల్డ్‌ ఏవిగేషన్‌, ఇఫ్కో మధ్య కుదిరిన భాగస్వామ్యం.. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు దోహదపడింది. ఇరు సంస్థలు 2023 డిసెంబరులో...

డ్రోన్‌ టెక్నాలజీ కంపెనీ ఐఓటెక్‌ వరల్డ్‌ ఏవిగేషన్‌

  • డ్రోన్‌ టెక్నాలజీ కంపెనీ ఐఓటెక్‌ వరల్డ్‌ ఏవిగేషన్‌, ఇఫ్కో మధ్య కుదిరిన భాగస్వామ్యం.. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు దోహదపడింది. ఇరు సంస్థలు 2023 డిసెంబరులో ఒప్పదం కుదుర్చుకుని రైతులకు 500 డ్రోన్లు సమకూర్చాయి. ఈ భాగస్వామ్యం కారణంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 30 లక్షల ఎకరాల్లో రైతులు డ్రోన్లను వినియోగించటం ద్వారా లబ్ది పొందారు.

  • విదేశీ మారక సేవలను అందించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ అనుమతి పొందింది. ఈ లైసెన్స్‌తో వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఫారెక్స్‌ లావాదేవీలను అందించటంతో పాటు రెమిటెన్సులు, డిపాజిట్ల స్వీకరణ వంటివి చేపట్టే అవకాశం లభించింది.

  • నిరంతరాయంగా జీఎ్‌సటీ చెల్లింపులను చేపట్టేందుకు జీఎ్‌సటీ పోర్టల్‌తో అనుసంధానమైనట్లు ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ పన్ను చెల్లింపులు, త్వరితగతిన చలాన్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బ్యాంక్‌ తెలిపింది.

Updated Date - Oct 06 , 2024 | 01:37 AM