Share News

Elon Musk: ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్.. రికార్డు స్థాయిలకు చేరిన టెస్లా షేర్..

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:22 PM

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ సంపద భారీగా పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్ ఏకంగా 40 శాతం పెరిగింది.

Elon Musk: ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్.. రికార్డు స్థాయిలకు చేరిన టెస్లా షేర్..
Elon Musk Is The Richest Person In History

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచిన దగ్గర్నుంచి టెస్లా షేర్ (Tesla stock) పరుగులు పెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ (Elon Musk) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ సంపద భారీగా పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్ ఏకంగా 40 శాతం పెరిగింది. దీంతో మస్క్ సంపద 334.4 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో మస్క్ ప్రపంచ కుబేరుడిగా అవతరించినట్టు అమెరికా వార్తా సంస్థ వెల్లడించింది. (World`s Richest Person)


శుక్రవారం ఒక్కరోజే టెస్లా స్టాక్ 3.84 శాతం పెరిగింది. దీంతో మస్క్ నికర సంపద 320 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి 334.4 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో సాన్నిహిత్యం కారణంగానే మస్క్ సంస్థపై మదుపర్లకు విశ్వాసం పెరిగింది. ట్రంప్ తన కార్యవర్గంలో ఎలన్ మస్క్‌ను కూడా చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా ఎలన్ మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు. దీంతో అమెరికా ప్రభుత్వ నిర్ణయాలపై మస్క్ ముద్ర కనిపించబోతోంది.


అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ పడుతున్న సమయంలో రిపబ్లిక్ అభ్యర్థి అయిన ట్రంప్‌నకు మస్క్ మద్దతుగా నిలిచారు. భారీ స్థాయిలో విరాళాలు అందించారు. ప్రచారంలో ట్రంప్‌నకు అనుకూలంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రజల మూడ్‌ను ట్రంప్‌నకు అనుకూలంగా మార్చడంలో మస్క్ క్రీయాశీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే మస్క్‌కు ట్రంప్ సముచిత గౌరవం కల్పించారు. అధ్యక్షుడికి సన్నిహితుడు కావడంతోనే ట్రంప్ సంస్థ షేర్లు పరుగులు పెడుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2024 | 01:22 PM