Share News

X: మస్క్ చేతిలో ఎక్స్ విలువ భారీగా పతనం.. ఎంతంటే..

ABN , Publish Date - Oct 03 , 2024 | 08:48 AM

ఎక్స్‌(ట్విటర్) విలువ రెండేళ్ల క్రితం ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన సమయంతో పోలిస్తే, ఏకంగా 80 శాతం తగ్గిందని పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఫెడెలిటీ తెలిపింది. మస్క్‌ యాజమాన్యంలో కంపెనీ ఆర్థిక పనితీరు, భవితవ్యంపై తలెత్తిన ఆందోళనలే ఇందుకు కారణమని వెల్లడించింది.

X: మస్క్ చేతిలో ఎక్స్ విలువ భారీగా పతనం.. ఎంతంటే..
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: ఎక్స్‌(ట్విటర్) విలువ రెండేళ్ల క్రితం ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన సమయంతో పోలిస్తే, ఏకంగా 80 శాతం తగ్గిందని పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఫెడెలిటీ తెలిపింది. మస్క్‌ యాజమాన్యంలో కంపెనీ ఆర్థిక పనితీరు, భవితవ్యంపై తలెత్తిన ఆందోళనలే ఇందుకు కారణమని వెల్లడించింది. 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను మస్క్ 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీలో 3.7 లక్షల కోట్లన్నమాట. ఆ తర్వాత ఎక్స్ఛేంజీల్లో ఎక్స్‌ షేరు ట్రేడ్‌ కాకపోయినప్పటికీ, ఫెడెలిటీ మాత్రం ఎక్స్‌లో తనకున్న షేర్ల విలువను వెల్లడిస్తోంది.


elon musk.jpg

తాజా నివేదిక ప్రకారం.. ఫెడిలిటీకి ఎక్స్‌లో ఉన్న షేర్ల విలువ 2022 అక్టోబరులో 19.66 మిలియన్‌ డాలర్లు కాగా, 2024 ఆగస్టు చివరకు 4.2 మి. డాలర్లకు పతనమైంది. అంటే 79 శాతం క్షీణించిందన్నమాట. వీటి ప్రకారం ఎక్స్‌ మొత్తం విలువ 9.4 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.78 వేల కోట్లే అవుతుంది. మస్క్‌ కొనుగోలు చేసినప్పటి విలువతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.


అంగీకరించని విశ్లేషకులు..

ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ విలువ తగ్గిందని ఫెడెలిటీ వేసిన అంచనాలను కొందరు విశ్లేషకులు అంగీకరించట్లేదు. దీర్ఘకాలంలో మస్క్‌ చెల్లించిన విలువ కంటే ఎక్కువ విలువకు ఎక్స్‌ చేరుకుంటుందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ 15 బిలియన్ డాలర్లకు చేరి ఉండొచ్చని వెడిబుల్‌ సెక్యూరిటీస్‌ ఎండీ డాన్‌ ఐవెస్‌ అన్నారు. వినియోగదారులను ఆకర్షించడంలో ఎక్స్ సఫలమైందని.. అయితే ఎక్స్.. ప్రస్తుతం కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కుంటోందని తెలిపారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కేవలం 4 శాతం ‘బ్రాండ్‌ సేఫ్టీ’నే అందిస్తోందని.. గూగుల్‌ ఇచ్చే 39 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని ప్రకటనదారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఎక్స్‌లో తమ వ్యయాలు తగ్గించుకోవాలని 26 శాతం మార్కెటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Gold Prices Today: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగాయ్

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే


For Latest News and Telangana News click here

Updated Date - Oct 03 , 2024 | 09:07 AM