Share News

ఈఎంఐలు మరింత ప్రియం

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:42 AM

అన్ని కాలపరిమితుల రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.10 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ నెల 15 (శనివారం) నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. దాంతో ఎంసీఎల్‌ఆర్‌...

ఈఎంఐలు మరింత ప్రియం

  • అన్ని కాలపరిమితి వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచిన ఎస్‌బీఐ

  • ఈ నెల 15 నుంచే అమల్లోకి..

న్యూఢిల్లీ: అన్ని కాలపరిమితుల రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.10 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ నెల 15 (శనివారం) నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. దాంతో ఎంసీఎల్‌ఆర్‌ అనుసంధానిత రుణాల నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల భారం మరింత పెరగనుంది. ఎస్‌బీఐ ఏడాది కాలపరిమితి రుణాల ఎంసీఎల్‌ఆర్‌ రేటును 8.65ు నుంచి 8.75 శాతానికి, రెండేళ్ల కాలపరిమితి రుణాల ఎంసీఎల్‌ఆర్‌ను 8.75ు నుంచి 8.85 శాతానికి పెంచింది. మూడేళ్లకు ఎంసీఎల్‌ఆర్‌ 8.85ు నుంచి 8.95 శాతానికి పెరిగింది. చాలావరకు గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఏడాది ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానితమై ఉన్నాయి.


అయితే, వడ్డీ పెరుగుదల బ్యాంక్‌ జారీచేసిన ఎంసీఎల్‌ఆర్‌ అనుసంధానిత రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. రుణాల వడ్డీ రేట్లను ఎంసీఎల్‌ఆర్‌కు బదులు రెపో రేటు లేదా మరే ఇతర మార్కెట్‌ రేట్లతో అనుసంధానించాలని బ్యాంక్‌లను ఆర్‌బీఐ 2019లో నిర్దేశించింది. అప్పటి నుంచి బ్యాంక్‌లు చాలావరకు రుణాలపై వడ్డీ రేట్ల నిర్ణయానికి రెపో రేటునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

Updated Date - Jun 16 , 2024 | 05:42 AM