Enter Technologies : ఎంటార్ టెక్‌కు రూ.226 కోట్ల ఆర్డర్లు
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:27 AM
క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ విభాగాల్లో రూ.226 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్ వెల్లడించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ విభాగాల్లో రూ.226 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్ వెల్లడించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో బ్లూమ్ ఎనర్జీ నుంచి రూ.191 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకోగా రఫెల్, ఐఎంఐ సిస్టమ్స్, ఐఏఐ సహా ఏరోస్పేస్ రంగంలోని పేరొందిన కంపెనీల నుంచి రూ.35 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపింది. ఏడాది కాలంలో ఈ ఆర్డర్లను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ విభాగాల నుంచి మరిన్ని ఆర్డర్లను అందుకోవచ్చని భావిస్తున్నట్లు ఎంటార్ టెక్నాలజీస్ తెలిపింది.