Share News

Intel: ఇంటెల్‌లో తొలగింపులు! ఉద్యోగుల కోసం సంస్థ మాజీ సీఈఓ ఉపవాస దీక్ష

ABN , Publish Date - Dec 12 , 2024 | 06:50 PM

ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఇంటెల్‌లో ఉద్యోగుల మేలు కోసం తాను చేపడుతున్న ఉపవాస దీక్షలో సహోద్యోగులు పాల్గొనాలంటూ సంస్థ మాజీ సీఈఓ పాట్ గెల్‌సింగర్ తాజాగా నెట్టింట అభ్యర్థించారు.

Intel: ఇంటెల్‌లో తొలగింపులు! ఉద్యోగుల కోసం సంస్థ మాజీ సీఈఓ ఉపవాస దీక్ష

ఇంటర్నెట్ డెస్క్: ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఇంటెల్‌లో ఉద్యోగుల మేలు కోసం తాను చేపడుతున్న ఉపవాస దీక్షలో సహోద్యోగులు పాల్గొనాలంటూ సంస్థ మాజీ సీఈఓ పాట్ గెల్‌సింగర్ తాజాగా నెట్టింట అభ్యర్థించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ప్రతి గురువారం నేను 24 గంటల పాటు ప్రార్థన ఉపవాస దీక్ష చేపడతాను. అయితే, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇంటెల్‌లోని ఉద్యోగుల మేలు కోసం ఈసారి నేను చేస్తున్న ఉపవాస కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. అమెరికా, ఐటీ రంగ భవితవ్యానికి ఇంటెల్, అందులోని ఉద్యోగులు ఎంతో ముఖ్యం’’ అని ఆయన పోస్టు పెట్టారు (Business News).

Stock Market: దేశీయ సూచీలకు నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..


అంతకుమునుపు, గెల్‌సింగర్‌ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని సంస్థ బోర్డు ఆయనకు ఉద్వాసన పలికింది. మరోవైపు, ఇంటెల్ షేర్లు ఇటీవల కాలంలో బాగా డీలా పడ్డాయి. సంస్థ షేర్ల విలువ ఏకంగా 58 శాతం పతనమైంది. మరోవైపు, పోటీ సంస్థ ఎన్వీడియా బలపడుతుండగా ఎస్‌ అండ్ పీ సూచీ కూడా పైకి ఎగబాకింది.

కాగా, ఇటీవల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సంస్థ తన ఉద్యోగుల్లో ఏకంగా 15 శాతం మందిని సాగనంపింది. మరోవైపు, సంస్థ షేరు విలువ 0.46 డాలర్లు దిగజారగా వార్షిక ఆదాయంలో ఏకంగా 6.2 శాతం కోత పడి 13.28 బిలియన్ డాలర్లు చేరుకుంది.

Today Gold Rates: మరీ ఇంత పిరమా.. బంగారం ముట్టుకుంటే షాకే


ఇక ఇంటెల్ పగ్గాలను డెవిడ్ జిన్సనర్, మిషెల్ జాన్స్‌టన్ హోల్‌థాస్ తాత్కాలిక ప్రాతిపదికన కోసీఈఓలుగా చేపట్టారు. మరోవైపు, శాశ్వత సీఈఓ కోసం సంస్థ తీవ్రంగా గాలిస్తోంది. సంస్థలోని ఉద్యోగులతో పాటు బయటి వారిని సీఈఓలుగా నియమిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన చేస్తోంది. మార్వెల్ టెక్నాలజీకి చెందిన మాట్ మర్ఫీ‌తో పాటు ఇంటెల్ బోర్డు మాజీ సభ్యుడు లీ బూ టాన్ పేరు కూడా పరిశీలనలో ఉంది.

Read Latest and Business News

Updated Date - Dec 12 , 2024 | 06:56 PM