బ్యాంక్ గ్యారెంటీ నుంచి మినహాయించండి
ABN , Publish Date - Jul 12 , 2024 | 04:46 AM
వొడాఫోన్ ఐడియా ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. స్పెక్ట్రమ్ పాత బకాయిలు చెల్లించేందుకూ కంపెనీ ఆపసోపాలు పడుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లో ఇందుకోసం...
‘డాట్’కు వొడాఫోన్ ఐడియా వేడుకోలు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. స్పెక్ట్రమ్ పాత బకాయిలు చెల్లించేందుకూ కంపెనీ ఆపసోపాలు పడుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లో ఇందుకోసం చెల్లించాల్సిన రూ.24,747 కోట్ల మొత్తానికీ బ్యాంకు గ్యారెంటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని టెలికాం శాఖ (డాట్)ను కోరింది. స్పెక్ట్రమ్ వేలం నిబంధనల ప్రకా రం చెల్లించాల్సిన బకాయిలకు ఏడాది ముందే టెలికాం కంపెనీలు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలి. ఈ బకాయిల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియాకు నాలుగేళ్ల విరామం ఇచ్చింది. అయినా కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. దీంతో వచ్చే ఏడాది చెల్లించాల్సిన బకాయిలకూ బ్యాంకు హామీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది.