డాక్టర్ రెడ్డీస్ ‘ఇబుప్రొఫెన్’పై ఎఫ్‌డీఏ వేటు
ABN , Publish Date - Sep 05 , 2024 | 02:45 AM
డాక్టర్ రెడ్డీ లాబ్స్, సిప్లా కంపెనీలకు అమెరికా మార్కెట్‌లో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కంపెనీల అమెరికా అనుబంధ సంస్థలు మార్కెట్ చేస్తున్న రెండు ఉత్పత్తులపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ కొరడా...
న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీ లాబ్స్, సిప్లా కంపెనీలకు అమెరికా మార్కెట్‌లో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కంపెనీల అమెరికా అనుబంధ సంస్థలు మార్కెట్ చేస్తున్న రెండు ఉత్పత్తులపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ కొరడా ఝళిపించింది. డాక్టర్ రెడ్డీస్ కంపెనీ మార్కెట్ చేసే ఇబుప్రొఫెన్, సిప్లా కంపెనీ మార్కెట్ చేసే సిఫిక్సైమ్ ఔషధాలు సరైన నాణ్యతా ప్రమాణాలు లేనందున వెనక్కి (రికాల్) తీసుకోవాలని ఆదేశించింది. ఇబుప్రొఫెన్ టాబ్లెట్లను నొప్పులు, జ్వరం తగ్గేందుకు ఉపయోగిస్తారు. సిప్లా కంపెనీ మార్కెట్ చేసే సిఫిక్సైమ్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లలో ఉపయోగిస్తారు. దీంతో వివిధ మోతాదుల్లో ఉన్న 1,50,040 ఇబుప్రొఫెన్ బాటిల్స్‌ను డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, 4,554 బాటిళ్ల సిఫిక్సైమ్ ఔషధాన్ని సిప్లా కంపెనీ వెనక్కి తీసుకున్నాయి.