Share News

ఐదు రోజుల నష్టాలకు తెర

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:24 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్ల ఐదు రోజుల పతనానికి బ్రేక్‌ పడింది. కనిష్ఠ స్థాయిల వద్ద మదుపరులు పెద్దఎత్తున కొనుగోళ్లకు దిగటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లభించటంతో...

ఐదు రోజుల నష్టాలకు తెర

సెన్సెక్స్‌ 499 పాయింట్లు అప్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్ల ఐదు రోజుల పతనానికి బ్రేక్‌ పడింది. కనిష్ఠ స్థాయిల వద్ద మదుపరులు పెద్దఎత్తున కొనుగోళ్లకు దిగటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లభించటంతో సోమవారం బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ పరుగులు తీశాయి. బ్లూచిప్‌ షేర్లయిన ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎగబడటం మార్కెట్లకు కలిసి వచ్చిందని ట్రేడర్లు తెలిపారు. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 876.53 పాయిట్లు దూసుకుపోయి 78,918.12 పాయింట్ల స్థాయిని తాకింది. చివరకు498.58 పాయింట్ల లాభంతో 78,540.17 పాయింట్ల వద్ద క్లోజైంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 165.95 పాయింట్ల లాభంతో 23,753.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్‌, ఐటీ రంగాల షేర్లు మంచి రికవరీ సాధించటం మార్కెట్లలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ను నింపిందని మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు.


బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లు పనిచేస్తాయ్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 శనివారం అయినప్పటికీ స్టాక్‌ మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రకటించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ రోజున 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటంతో మార్కెట్లలో ట్రేడింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెల్లడించాయి.

Updated Date - Dec 24 , 2024 | 06:14 AM