Share News

ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌.. రూ.20,000 కోట్లు

ABN , Publish Date - Nov 11 , 2024 | 02:38 AM

భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో (నవంబరు 4-8) ఎఫ్‌పీఐలు దాదాపు రూ.20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి...

ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌..  రూ.20,000 కోట్లు

భారీగా ఎఫ్‌పీఐల అమ్మకాలు

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో (నవంబరు 4-8) ఎఫ్‌పీఐలు దాదాపు రూ.20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అక్టోబరు నెల మొత్తానికి చూసినా ఈ సంస్థలు భారత మార్కెట్లో రూ.1.14 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. దేశీయ కంపెనీల షేర్లు అధిక వాల్యుయేషన్‌తో ట్రేడవడం, చైనా మార్కెట్‌ మన కంటే ఆకర్షణీయంగా కనిపించడం, క్యూ2 ఆర్థిక ఫలితాలు ఆశించినంతగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. కాగా డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా ఆకర్షణీయంగా లేకపోతే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ఇప్పట్లో తెరపడదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Nov 11 , 2024 | 02:38 AM