గ్లాండ్ ఫార్మాలో 6 శాతం వాటా విక్రయించిన ఫోసున్ ఫార్మా
ABN , Publish Date - Jun 20 , 2024 | 01:14 AM
గ్లాండ్ ఫార్మాలో 6 శాతం వాటాలను ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఫోసున్ ఫార్మా విక్రయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా జరిగిన ఈ లావాదేవీ విలువ రూ.1754 కోట్లు...
న్యూఢిల్లీ: గ్లాండ్ ఫార్మాలో 6 శాతం వాటాలను ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఫోసున్ ఫార్మా విక్రయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా జరిగిన ఈ లావాదేవీ విలువ రూ.1754 కోట్లు. చైనాకు చెందిన ఫోసున్ ఫార్మా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న గ్లాండ్ ఫార్మాలో తన అనుబంధ సంస్థ ఫోసున్ ఫార్మా ఇండస్ర్టియల్ పిటీఈ ద్వారా ఈ బల్క్ డీల్ నిర్వహించినట్టు బీఎస్‌ఈకి పంపిన నివేదికలో తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా 6 శాతం వాటాతో సమానమైన 99 లక్షల షేర్లను ఒక్కో షేరు రూ.1771.81 సగటు ధరకు విక్రయించినట్టు పేర్కొంది. ఈ విక్రయం అనంతరం గ్లాండ్ ఫార్మాలో ఫోసున్ ఫార్మా వాటా 51.86 శాతానికి తగ్గింది. మరోపక్క గ్లాండ్ ఫార్మాలో యూబీఎస్ ప్రిన్సిపల్ కేపిటల్ ఏషియా 8.25 లక్షల షేర్లను (0.5 శాతం) కొనుగోలు చేసింది. ఒక్కో షేరు రూ.1771.05 సగటు ధరకు కొనుగోలు చేయగా మొత్తం డీల్ విలువ రూ.146.11 కోట్లయింది.