ఆరంభ నష్టాల్లోంచి లాభాల్లోకి..
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:35 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో ఆరంభ నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో పయనించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో...
సెన్సెక్స్ 445 పాయింట్లు అప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో ఆరంభ నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో పయనించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. సెప్టెంబరు త్రైమాసికానికి జీడీపీ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్.. ఒక దశలో దాదాపు 500 పాయింట్ల వరకు కోల్పోయి 79,308.95 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి లాభాల్లోకి మళ్లిన సూచీ ఒక దశలో 535 పాయింట్ల వృద్ధితో 80,337.82 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని రికార్డు చేసింది. రోజంతా 1,030 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్..
చివరికి 445.29 పాయింట్ల లాభంతో 80,248.08 వద్ద స్థిరపడింది. 80,000 స్థాయిని మళ్లీ నిలబెట్టుకోగలిగింది. నిఫ్టీ విషయానికొస్తే, 144.95 పాయింట్ల లాభంతో 24,276.05 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 21 రాణించాయి.