Share News

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం ధర

ABN , Publish Date - Nov 04 , 2024 | 07:22 PM

గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.వెయ్యికి పైగా తగ్గింది. గోల్డ్ రేట్ తగ్గిందనే విషయం తెలిసి బంగారం కొనుగోలు చేసేందుకు షాపులకు మహిళలు క్యూ కడుతున్నారు.

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం ధర
Gold Rates

హైదరాబాద్: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. పసిడి ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.వెయ్యికి పైగా తగ్గుదల నమోదైంది. దీపావళి పండగ ముగిసింది, మంచి రోజులు వచ్చాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలతో తెలుగు లోగిళ్లు కళకళ లాడుతున్నాయి. ఇంతలో బంగారం ధర భారీగా తగ్గడంతో మహిళలు తెగ సంబర పడిపోతున్నారు.


Gold-buying.jpg


రూ.1300 తగ్గింది..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారంపై (24 క్యారెట్లు) రూ.1300 మేర తగ్గింది. గురువారం నాడు రూ.82,400 ఉండగా, సోమవారం రూ.81,100కు చేరింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది. ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ. లక్ష దాటగా.. ఈ రోజు రూ.94,900కి చేరింది. కిలో వెండిపై రూ.4600 తగ్గింది.


gold.jpg


వెండి ధర కూడా

బంగారం ఔన్స్ 2740 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్స్ 32.80 డాలర్లుగా ఉంది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. నవంబర్ 5వ తేదీన (మంగళవారం) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. 7వ తేదీన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పర్కటన ఉండనుంది. ఈ క్రమంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ వారంలో ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Stock Markets: ఇవాళ ఒక్క రోజే రూ.7.37 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే

తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Nov 04 , 2024 | 07:22 PM